Begin typing your search above and press return to search.

సమ్మర్ కి సైరా మిస్

By:  Tupaki Desk   |   30 Nov 2018 8:25 AM
సమ్మర్ కి సైరా మిస్
X
మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ జరిగి రెండేళ్ళు అవుతున్నా కొత్త సినిమా విడుదలలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. చిరు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహరెడ్డి షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది కాని బాలన్స్ మాత్రం భారీగా ఉంది. వచ్చే మంగళవారం నుంచి మూడు వారాల కీలకమైన షెడ్యూల్ కోసం చెన్నైలో మకాం వేయబోతున్న సైరా టీం ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి కొనసాగిస్తుంది. చెన్నై పార్ట్ లోనే నయనతార సీన్స్ తో పాటు ఒక పాట ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

జలపాతాల నేపధ్యంలో సైరా అజ్ఞాతం ఉన్నప్పటి సన్నివేశాలతో పాటు చిరు నయన్ ల మీద చిన్న బిట్ సాంగ్ షూట్ చేయబోతున్నట్టు లీకవుతున్న న్యూస్ అప్ డేట్. కాని వచ్చే వేసవికి సైరాగా మెగాస్టార్ విశ్వరూపం చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు మాత్రం విడుదల తేది విషయంలో కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు గ్రాఫిక్ వర్క్ కి చాలా సమయం అవసరం ఉండటంతో దాని కోసం కనీసం ఆరు నెలల టైం పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట సూరి టీం.

అయితే ముందు అనుకున్న మే 9కి రావడం అసాధ్యం. షూటింగ్ మొత్తం పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టడానికే ఫిబ్రవరి వచ్చేలా ఉంది. అలాంటప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసి మేలో తేవడం జరగని పని. ఒకవేళ చేద్దాం అనుకున్నా క్వాలిటీలో రాజీ పడి అవుట్ పుట్ లో తేడా రావొచ్చు. అలా కాకుండా అన్ని సాఫీగా పూర్తి చేసి దసరాకి వచ్చే ఆలోచనలో కొణిదెల సంస్థ ఉన్నట్టు సమాచారం. ఇదంతా అనఫిషీయల్ న్యూస్ కాబట్టి నిర్మాతగా రామ్ చరణ్ ఫలానా తేదికి ఖచ్చితంగా విడుదల చేస్తామని ఖచ్చితంగా చెప్తే కాని నమ్మలేని పరిస్థితి