Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ సైరాకు సవాల్ షురూ!
By: Tupaki Desk | 5 March 2019 1:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా మీద ఇంకా బజ్ పెంచే ప్రయత్నాలు జరగడం లేదు. దసరాకు విడుదల చేసే టార్గెట్ తో షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డ టీమ్ పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టేందుకు ఇంకా టైం కావాలంటోంది. ఇదిలా ఉండగా మరోపక్క నిర్మాత రామ్ చరణ్ బిజినెస్ డీల్స్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఓవర్ సీస్ కోసం సుమారు 4 మిలియన్ డాలర్లు అడిగినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇది చాలా పెద్ద మొత్తం. కేవలం బాహుబలి మాత్రమే ఇంత పెద్ద ఫిగర్ ని ఇప్పటిదాకా అందుకోగలిగింది.
ఇప్పుడు మెగాస్టార్ అందులోనూ దానికి దీటుగా నిర్మిస్తున్న మూవీ కాబట్టి ఖచ్చితంగా సేఫ్ అవుతుందని రామ్ చరణ్ చెబుతున్నా కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. బాహుబలి అంత మార్కెట్ తెచ్చుకోవడానికి ప్రభాస్ ఇమేజ్ తో పాటు రాజమౌళి బ్రాండ్ కూడా సమానంగా పని చేసింది. కానీ సైరాకు సురేందర్ రెడ్డి ఆ స్థాయిలో ప్లస్ అయ్యే సీన్ ప్రస్తుతానికి లేదు
కాబట్టి 4 మిలియన్ల డాలర్లు అంటే కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు వినికిడి. అలా కాకుండా ప్రాఫిట్ షేరింగ్ స్కీం మీద వెళదామని అప్పుడు నిర్మాతకు బయ్యర్ కు ఇద్దరికీ రిస్క్ తగ్గుతుందని ఆ దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ దసరా రిలీజ్ పక్కా అనుకుంటే రామ్ చరణ్ ఈ వ్యవహారాలన్నీ త్వరలో ఒక కొలిక్కి తెచ్చుకోవాలి. ఇప్పటి నుంచి లెక్కేసుకున్నా చేతిలో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఒకవేళ దసరా మిస్ అయితే మాత్రం నెక్స్ట్ సంక్రాంతికి వెళ్లడం తప్ప వేరే మార్గం ఉండదు. మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు ఇంకా కొనసాగడం తప్పదు