Begin typing your search above and press return to search.

'సైరా' విషయంలో ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   26 Sep 2019 4:54 AM GMT
సైరా విషయంలో ఏం జరుగుతుంది?
X
మెగా స్టార్ ప్రెస్టీజీయస్ మూవీ 'సైరా నరసింహ రెడ్డి' విడుదలకు ఇంకా ఆరు రోజులే ఉంది. సినిమాపై మాత్రం ఎక్కడ బజ్ రావట్లేదు. ఒక పెద్ద సినిమా వారం రోజుల్లో రిలీజ్ అంటే ఈ పాటికే ఎక్కడ చూసినా ఆ సినిమా సందడే కనిపించాలి. ఎందుకో 'సైరా' విషయంలో అలా జరగడం లేదు. చరణ్ ప్లానింగ్ ఏంటో.. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. భారీ బడ్జెట్ సినిమా తీసి ప్రమోషన్స్ లో మాత్రం వీక్ అనిపించుకుంటున్నాడు చరణ్.

మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాతైనా ప్రమోషన్స్ లో వేగం పెంచుతారని ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్ కి నిరాశే మిగులుతుంది. అందుకే చేసేదేమీ లేక ప్రొడక్షన్ నుండి భారీ ఎత్తున ప్రమోషన్స్ లేకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్సే సినిమాపై బజ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. వాల్లే కౌంట్ డౌన్ వీడియోస్ చేసి వదులుతున్నారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఒక టీమ్ లా ఏర్పడి సినిమా ప్రమోషన్స్ ను తమ భుజాలపై వేసుకుంటున్నారు.

ఇక ప్యాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ - చిరు - చరణ్ - సురేందర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన వీడియో వదులుతారని అన్నారు. అదీ ఇంత వరకూ లేదు. ఇక ఈరోజు రెండో ట్రైలర్ వదిలి కొంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ట్రైలర్ తో అయినా సినిమాపై ఓ రేంజ్ లో బజ్ వస్తుందా సందడి మొదలవుతుందా చూడాలి.