Begin typing your search above and press return to search.
సైరా డెడ్ లైన్ ఫిక్స్ అయ్యింది
By: Tupaki Desk | 23 May 2019 5:44 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా 150 సినిమాల కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీగా సైరా అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది.ఖైదీ నెంబర్ 150 వచ్చి రెండేళ్లు దాటిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు చిరుని స్క్రీన్ మీద చూద్దామా అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ మీడియాలో గట్టి ప్రచారమే జరిగింది.
ఇది నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి అధికారిక ప్రకటన రాలేదు కానీ అంతర్గతంగా నిర్ణయం జరిగిపోయినట్టు సమాచారం. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ఆ టైంలోనే విడుదల ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాల నిర్మాతలకు ఇన్ డైరెక్ట్ ఫీలర్స్ వెళ్ళిపోయాయట. ఈ కారణంగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసినట్టు టాక్ ఉంది
అక్టోబర్ లో దసరా సీజన్ ని వదిలేస్తే మళ్ళి జనవరి దాకా ఛాన్స్ దొరకదు. సో సైరా ఖచ్చితంగా రావాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చిరు పుట్టిన రోజు ఆగష్టు 22న వెలువరించే అవకాశం ఉంది. ఆ లోపు మెల్లగా హైప్ ఇంకాస్త పెంచే విధంగా ప్రమోషన్ ప్లాన్ చేసేలా సైరా టీమ్ ఇప్పటికే కొన్ని చర్చలు జరిపినట్టు సమాచారం. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సైరా ఒకేసారి అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిజినెస్ వ్యవహారాలు కూడా వచ్చే నెల లేదా జులై నుంచి ఊపందుకోవచ్చు.