Begin typing your search above and press return to search.
సైరా మీద వాయిదా ప్రచారం
By: Tupaki Desk | 6 Sep 2019 8:19 AM GMTఅక్టోబర్ 2 ష్యూర్ షాట్ గా సైరా నరసింహారెడ్డి వస్తున్నాడన్న మెగా ఫాన్స్ ఆశలకు గండి కొడుతూ విడుదల వాయిదా పడొచ్చన్న ప్రచారం వాళ్ళలో ఆందోళన కలిగిస్తోంది. కొణిదెల యూనిట్ నుంచి దీనికి సంబంధించి అధికారిక అప్ డేట్ లేదు కానీ ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం ఆ చర్చలైతే సీరియస్ గానే సాగుతున్నాయట. ఇంకా ఫైనల్ కాపీ రెడీ కాకపోవడం లెన్త్ గ్రాఫిక్స్ కు సంబంధించి ఇంకాస్త బెటర్ మెంట్ కోసం చిరు నేతృత్వంలో యూనిట్ పనిచేస్తుండటం లాంటి కారణాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
మరోవైపు హృతిక్ రోషన్ వార్ తో డైరెక్ట్ క్లాష్ ఎంతమేరకు రిస్క్ అవుతుందనే కోణంలో కూడా ఫర్హాన్ అక్తర్ టీమ్ తో చరణ్ ప్రతినిధులు నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారట. స్క్రీన్ కౌంట్ మ్యాక్సిమం వచ్చేలా చూస్తామని వార్ కు దీటుగా కంటెంట్ తో కొట్టాల్సిన బాధ్యత మాత్రం మీదేనని వాళ్ళు చెప్పడంతో ఓ కంక్లూజన్ కు రావడం కష్టమైపోతోందని వినికిడి. దీని సంగతలా ఉంచితే ప్రీ రిలీజ్ ఈ నెల 15న కర్నూల్ లో జరుగుతుందనే న్యూస్ ఇప్పటికే మీడియా మొత్తం పాకిపోయింది.
అంత పెద్ద క్యాస్టింగ్ ని మేనేజ్ చేసి రద్దీని కంట్రోల్ చేయగలిగే వ్యవస్థ అక్కడా ఉందా అనే దాని గురించి మెగా కాంపౌండ్ వర్గాలు సమాచార సేకరణలో పడ్డాయి. అక్కడి పోలీస్ శాఖ భరోసా ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ నిజంగా 15నే ఈవెంట్ అనుకుంటే ఇంకో తొమ్మిది రోజులు మాత్రమే టైం ఉంది. ఎలా చేస్తారు గెస్టులు ఎవరు వస్తారు అనే దాని గురించి పక్కా క్లారిటీ లేదు. మొన్నటిదాకా అక్టోబర్ 2 సైరా విడుదల అని కాన్ఫిడెంట్ వినిపించిన మాటల్లో కొంత ఊపు తగ్గిన మాట వాస్తవం. నిజానిజాలు ఇంకో వారంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం