Begin typing your search above and press return to search.
రంగస్థలంకు వచ్చిన మెగాస్టార్
By: Tupaki Desk | 20 April 2018 3:53 AM GMTరామ్ చరణ్ మూవీ రంగస్థలం.. బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు అంతకు మించి అనే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి రామ్ చరణ్ నటన.. ఇతర నటీనటుల యాక్టింగ్.. సుకుమార్ డైరెక్షన్ తో పాటు రంగస్థలం గ్రామం సెట్ కూడా ఓ హైలైట్ గా నిలిచింది. కొన్ని దశాబ్దాలకు పూర్వంలోకి ఆడియన్స్ ను తీసుకెళ్లేందుకు ఈ సెట్ సహకరించింది.
మెగా పవర్ స్టార్ మూవీ కోసం వేసిన ఇదే సెట్ లో ఇప్పుడు మెగాస్టార్ మూవీ షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేయడం విశేషం. చిరంజీవి నటిస్తున్న సైరా కూడా పీరియాడిక్ మూవీనే. కానీ ఏకంగా 2 శతాబ్దాలు వెనక్కు వెళ్లాలి. అంటే ఆ కాలం నాటి గ్రామాలు కూడా అవసరం. ఇందుకు సెట్స్ వేయడం తప్పనిసరి. ఇప్పుడు రంగస్థలం గ్రామం సెట్ ను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించిన సైరా టీం.. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసినట్లు తెలుస్తోంది. మొదటగా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ చేసిన సైరా యూనిట్.. ఆ తర్వాత కొన్ని భారీ సెట్స్ లో షూటింగ్ నిర్వహించారు.
ఇప్పుడు రంగస్థలం గ్రామం సెట్ లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ పార్ట్ ను శరవేగంగా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డికి.. నిర్మాత రామ్ చరణ్ నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ అందుతోంది. ఇందులో భాగమే రంగస్థలం సెట్ కూడా. ఇలాంటి సెట్ వేసేందుకు 2 నెలల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు వీరికి రెడీగా ఓ ఊరు మొత్తం లభించిందన్న మాట. దానికి కొన్ని మార్పు చేర్పులు చేసి.. కొన్ని వారాల పాటు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.