Begin typing your search above and press return to search.
'సైరా' ట్రైలర్ వచ్చేస్తోంది బీ రెడీ!
By: Tupaki Desk | 14 Jun 2019 4:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పిరియాడిక్ డ్రామా `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్తిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. చిన్ని చిన్న ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బ్యాలెన్స్‌గా వున్న ప్యాచ్ వర్క్ ని త్వరలో పూర్తి చేయబోతున్నారు. దీంతో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తికాబోతోంది. రాపిడ్ స్పీడుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. `బాహుబలి` తరువాత ఆ స్పాన్ లో వస్తున్న సినిమా కావడం - ఇందులో బిగ్ బీ నటించడం వంటి కారణాలతో సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2ను లాక్ చేశారు. అదే రోజు భారీ స్థాయిలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని హీరో రామ్ చరణ్ ప్లాన్ మొదలుపెట్టాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా దేశ భక్తి - తెలుగు వీరుడు వీర పరాక్రమాల నేపథ్యంలో అత్యంత భారీగా దేశ భక్తిని ప్రబోదిస్తూ ఈచ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి చిత్ర విడుదలకు దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీజీ జయంతి అయిన అక్టోబర్ 2 కరెక్ట్ గా వుంటుందని డిసైడ్ అయిన చిత్ర బృందం ఈ చిత్ర విడుదల కోసం ఈ తేదీనే లాక్ చేసేశారని తెలిసింది.
`సైరా` ఫస్ట్ లుక్ టీజర్ ని గత ఏడాది విడుదల చేసిన చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కోపం ప్లాన్ చేస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతోంది. అదే రోజు మెగా అభిమానులకు మెగా గిఫ్ట్ ఇవ్వడానికి థియేట్రికల్ ట్రైలర్ ని సిద్ధం చేస్తున్నారు. `సాహో` చిత్ర ట్రైలర్ ని ఏ విధంగా అయితే ఏక కాలంలో నాలుగు భాషల్లో విడుదల చేశారో అదే తరహాలో `సైరా` థియేట్రికల్ ట్రైలర్ విడుదల కోసం `సైరా` టీమ్ వర్క్ చేస్తోంది. ఇందు కోసం రామ్ చరణ్ ఓ స్పషల్ టీమ్ ని ఏర్పాటు చేసి వర్క్ మొదలుపెట్టించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ థియేట్రికల్ హక్కుల్ని బాలీవుడ్ దర్శకుడు - నటుడు ఫర్హాన్ అక్తర్ కు చెందిన ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకుంది.