Begin typing your search above and press return to search.
చిట్టిబాబుకి నరసింహరెడ్డి సవాల్
By: Tupaki Desk | 30 April 2018 10:44 AM GMTరంగస్థలం మొదటి నెల పూర్తి చేసుకుంది. ఒక కమర్షియల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మహా అంటే మూడు వారాలకు మించి సందడి ఉండలేని పరిస్థితుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర చిట్టిబాబు ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం చూస్తుంటే ఇది కదా టాలీవుడ్ కోరుకునే నిజమైన విజయం అనిపించక మానదు. ఇప్పటికే 200 రోజులకు గ్రాస్ రాబట్టిన రంగస్థలం ఫుల్ రన్ ఇంకా పూర్తి కాలేదు. చాలా చోట్ల స్టడీగా వసూళ్లు రాబడుతునే ఉంది. నాన్ బాహుబలి పేరిట ఖైది నెంబర్ 150 కొల్లగొట్టేసిన రికార్డ్స్ అన్ని రంగస్థలం పెద్ద మార్జిన్ తోనే స్మాష్ చేసింది. ఇదే ప్రస్తావన డల్లస్ లో ఉన్న చిరు దగ్గర కొందరు ప్రవాసాంధ్రులు తీసుకురాగా నవ్వుతూ బదులిచ్చిన చిరంజీవి నాన్ బాహుబలి రికార్డులు తాను కొట్టానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవనీయకుండా చరణ్ చేసాడని, సైరాతో మొత్తం ఆ లెక్కలన్నీ సరి చేస్తామని అందరి ముందే ప్రకటించడంతో అభిమానుల చప్పట్లు మారుమ్రోగిపోయాయి.
పరిస్థితిని గమనిస్తే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాల్లో ఆ అవకాశం ఉన్నది నిజంగా సైరాకే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సైరాలో నయనతారతో పాటు తమన్నా హీరొయిన్ గా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ కాంబో సీన్స్ ను ఇటీవలే చిరు మీద చిత్రీకరించిన సురేందర్ రెడ్డి షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చాడు. వివిధ బాషలలో ఉన్న స్టార్ హీరోస్ ను ఇందులో భాగం చేయటంతో ఒకే ఫ్లోలో షూటింగ్ చేయటం కష్టమవుతోందని అందుకే చిన్న చిన్న వాయిదాలు తప్పడం లేదని టాక్. మరి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశం గురించి యూనిట్ ఇప్పుడే ఏం చెప్పలేకపోతోంది. ఉన్నది ఎనిమిది నెలల సమయమే కాబట్టి ఆ లోపే పూర్తి చేయటం సులభం కాదు. కొడుకు సాధించిన రికార్డ్స్ ను తన సినిమాతో మళ్ళి తిరగరాసే ఛాన్స్ చాలా అరుదుగా వస్తుంది. అప్పట్లో బాలకృష్ణ సినిమాకు ధీటుగా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చేస్తే అది అప్పటి దాకా ఉన్న రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. మరి చిరు కూడా అదే దారిలో సైరాతో రంగస్థలంని బీట్ చేస్తాడో లేదో వేచి చూడాలి.