Begin typing your search above and press return to search.

సైరా స్పీడ్ మాములుగా లేదు

By:  Tupaki Desk   |   25 Dec 2017 6:58 AM GMT
సైరా స్పీడ్ మాములుగా లేదు
X
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. మొదటి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కొన్ని కారణాల వల్ల మొదటి షెడ్యూల్ ఆలస్యంగానే స్టార్ట్ చేసినా కూడా దర్శకుడు సురేందర్ తొందరగానే పూర్తి చేశాడు. డిసెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అయిన మొదటి షెడ్యూల్ రీసెంట్ గా కాంప్లిట్ అయ్యింది.

హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో ప్రత్యేక సెట్స్ వేసి షూటింగ్ చేశారు. సినిమాలో కీలకమైన పోరాట సన్నివేశాలను దర్శకుడు తనదైన శైలిలో చిత్రీకరించాడు. ఇక మిగతా టెక్నీషియన్లు కూడా నిత్యం ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ తోనే బిజీగా గడిపారు. చిత్ర నిర్మాత చిరు తనయుడు రామ్ చరణ్ కూడా కొన్ని సీన్స్ ను తెరకెక్కించే సమయంలో షూటింగ్ స్పాట్ లో ఉన్నాడు. సినిమాలో ప్రతి సన్నివేశం కీలకం కావడంతో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పని చేస్తున్నారు. నిర్మాత రామ్ చరణ్ మొదట బడ్జెట్ లిమిట్ లో అనుకున్నా ఇప్పుడు అలాంటి ఆలోచనతో లేడని తెలుస్తోంది. సినిమా ఎండింగ్ వరకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చవ్వచ్చు అని టాక్.

ఇకపోతే నెక్స్ట్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ కొన్ని రోజుల బ్రేక్ తరువాత స్టార్ట్ చేయనుందట. అమితాబ్ - విజయ్ సేతుపతి - సుదీప్ కిచ్చా వంటి వారు సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు నెక్స్ట్ షెడ్యూల్ లో కనిపించనున్నారని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇక మెగాస్టార్ పక్కన నయనతార హీరోయిన్ గా నటించనుంది.