Begin typing your search above and press return to search.

తమిళనాడుకు వెళ్లనున్న సైరా

By:  Tupaki Desk   |   5 Jan 2018 8:20 AM GMT
తమిళనాడుకు వెళ్లనున్న సైరా
X
చారిత్రాత్మక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సైరాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయసున్న చిరంజీవి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సినిమా కోసం జిమ్ వర్కౌట్స్ అలాగే యాక్షన్ సీన్స్ కు సంబంధించి కొన్ని విషయాల గురించి చాలా కొత్తగా నేర్చుకుంటున్నాడు. సినిమాలో లుక్ కోసం కూడా మెగాస్టార్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల స్టార్ట్ అయినా సైరా ప్రస్తుతం బ్రేక్ లో ఉంది.

మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లోని కొన్ని ప్రత్యేక లొకేషన్స్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి పూర్తి చేశాడు. ఆ షెడ్యూల్లో లో చిత్ర యూనిట్ కొన్ని యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించింది. ప్రస్తుతం అందరు న్యూ ఇయర్ సంక్రాంతి సందర్బంగా బ్రేక్ తీసుకున్నారు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ ని సంక్రాంతి అయిపోయిన తరువాత అంటే ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు పెట్టనున్నారట. తమిళనాడులో పొల్లాచ్చి లోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యమైన సన్నివేశాలని షూట్ చేయనున్నారు.

ఇక సెకండ్ షెడ్యూల్ అయిపోయిన తరువాత సైరా టీమ్ మళ్లీ హైదరాబాద్ కి వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబదించిన సీన్స్ ని తెరకెక్కించనుంది. అందుకోసం సెట్స్ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక అక్కడి నుంచి షూటింగ్స్ ఏ మాత్రం బ్రేకులు పడకుండా సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ చిత్ర నిర్మాత రామ్ చరణ్ అనుకుంటున్నాడట. ఇక సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ - సుదీప్ అలాగే ఇతర ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.