Begin typing your search above and press return to search.

సైరా రెండవ అడుగు పడుతోంది

By:  Tupaki Desk   |   14 Feb 2018 11:27 AM GMT
సైరా రెండవ అడుగు పడుతోంది
X
బాహుబలి సినిమా తరువాత సౌత్ ఇండియా సినిమా చరిత్రలో అత్యంత భారీ బారి స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా సైరా. మొదటగా తన పాలనతో బ్రిటిష్ దొరలకు ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నరసింహ రెడ్డి పాత్ర కోసం ఇప్పటికే తన లుక్ లో చాలా మార్పులు చేశారు. తనయుడు రామ్ చరణ్ సలహాతో కొన్ని జిమ్ వర్కౌట్స్ కూడా బాగానే చేశాడు.

అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి ఫినిష్ చేసి చాలా రోజులు అవుతోంది. కానీ సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టడానికి మాత్రం ఇంకా తేదీని సెట్ చేసుకోలేక సతమతమవుతున్నాడు. గత కొంత కాలంగా సెకండ్ షెడ్యూల్ తేదీపై అనేక రూమర్స్ వచ్చాయి. ఎన్నో తేదీలను మార్చారు. సంగీత దర్శకుడు రెహమాన్ తప్పుకోవడం. అలాగే కెమెరామెన్ ని కూడా మార్చడంతో సినిమా అసలు ఇప్పట్లో ఫినిష్ అవుతుందా అనే కామెంట్స్ వినిపించాయి.

ఇక రీసెంట్ గా జరిపిన సమావేశంలో నిర్మాత రామ్ చరణ్ ఫైనల్ డేట్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే ఫిబ్రవరి 23న సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకు తగ్గటుగా ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక హైదరాబాద్ లో జరగబోయే ఆ షెడ్యూల్ లో బిగ్ బి అమితాబ్ కూడా జాయిన్ కానున్నాడు. వారితో పాటు జగపతి బాబు కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఫైనల్ గా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలను దర్శకుడు సురేందర్ రెడ్డి ఆలోచిస్తున్నాడు.