Begin typing your search above and press return to search.

సైరాకు '2.ఓ' ఒక పాఠం..!

By:  Tupaki Desk   |   1 Dec 2018 6:28 AM GMT
సైరాకు 2.ఓ ఒక పాఠం..!
X
సినిమాకు కోట్లు ఖర్చు పెట్టి, అద్బుతమైన లొకేషన్స్‌ - అత్యాధునిక టెక్నాలజీ వాడి విజువల్స్‌ ను గ్రాఫిక్స్‌ లో క్రియేట్‌ చేసినంత మాత్రాన సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారనుకుంటే అంతకు మించిన పొరపాటు ఏమీ ఉండదు. భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న నమ్మకం లేదనే విషయం మళ్లీ మళ్లీ నిరూపితం అవుతూనే ఉంది. ఇటీవల వచ్చిన థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ చిత్రం బాలీవుడ్‌ లోనే అత్యధిక బడ్జెట్‌ తో రూపొందిన చిత్రంగా పేరు దక్కించుకుంది. కాని సినిమాలో ఎమోషన్స్‌ తో పాటు - మంచి కథ లేకపోవడంతో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అదే అమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ చిత్రం తక్కువ బడ్జెట్‌ తో - చాలా సింపుల్‌ గా తీశారు. ఆ చిత్ర కలెక్షన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక తాజాగా వచ్చిన ‘2.ఓ’ చిత్రం ఏకంగా 550 కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. ఈ చిత్రంలో అద్బుతమైన విజువల్స్‌ తో పాటు - ఒక మంచి కథను కూడా చూపించాడు. కథ చిన్న పాయింటే అయినా కూడా ఎమోషనల్‌ గా కనెక్ట్‌ అయ్యేలా ఉంది. అందుకే 2.ఓ కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ రెండు సినిమాల నుండి రాబోతున్న భారీ బడ్జెట్‌ సినిమాలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సినిమా భారీగా ఉండటమే కాకుండా, ఎమోషన్స్‌ ను కూడా కలిగి ఉండాలి.

కథ, కథనం సరిగా ఉండి, సినిమా భారీతనంతో ఉంటే తప్పకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని బాహుబలి ద్వారా నిరూపితం అయ్యింది. అదే ‘2.ఓ’ విషయంలో రుజువు అయ్యింది. అందుకే ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రమైన ‘సైరా నరసింహారెడ్డి’కి కూడా ఇదే ఫార్ములా వర్తింపజేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. సైరాలో భారీగా గ్రాఫిక్స్‌ వర్క్‌ ఉండబోతుంది. దాంతో పాటు ఎమోషనల్‌ సీన్స్‌ - మంచి కథను కూడా చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆలస్యం అయినా పర్వాలేదు కాని సినిమాను ఎక్కడ అశ్రద్ద చేయకుండా పూర్తి చేయాలనేది చిత్ర యూనిట్‌ సభ్యుల ప్లాన్‌ గా తెలుస్తోంది. అందుకే సినిమా ను సమ్మర్‌ రేస్‌ నుండి తప్పించి - ఏకంగా 2020 సంక్రాంతికి వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆలస్యం అయినా పర్వాలేదు కాని 2.ఓ నుండి పాఠం నేర్చుకుని సైరాను చక్కగా తెరకెక్కించాలని మెగా ఫ్యాన్స్‌ కోరుతున్నారు. మరి సురేందర్‌ రెడ్డి ఎలాంటి కళాఖండాన్ని సృష్టిస్తాడో చూడాలి.