Begin typing your search above and press return to search.
ఒకే డేట్ పై చిరు ప్రభాస్ ల కన్ను?
By: Tupaki Desk | 29 Nov 2018 4:24 PM GMTభారీ బడ్జెట్ సినిమాలతో వచ్చిన చిక్కే ఇది. షూటింగ్ మొదలుపెట్టే నాటికి విడుదల చేయాలి అనుకునే సమయానికి చాలా మార్పులు చేర్పులు జరిగిపోయి ఒకోసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం సాహో సైరాలకు అలంటి చిక్కే వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాగా ఆలస్యమైన సాహోని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయాలనీ యువి సంస్థ లోపాయకారిగా ఒక నిర్ణయానికి వచ్చిందట. కాని ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రకటించి తీరా ఆ సమయానికి తేలేకపోతే అభిమానులు నిరాశ పడతారనే ఉద్దేశంతో ఇంకో మూడు నెలలు ఆగాక ప్రకటించాలని అనుకున్నారట.
అదే డేట్ అనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సైరా మే లేదా జూన్ లో వస్తుందని లీకులు ఉన్నాయి. అందుకే ఇది సాహోకు ఇది ఫిక్స్ చేసుకున్నారు. ఒకవేళ సైరా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు గ్రాఫిక్ వర్క్ ఆ సమయానికి పూర్తి కాకపోతే వాయిదా పడుతుంది. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సైరా స్వాతంత్ర సమర యోధుడి కథ కాబట్టి ఆగస్ట్ 15ను అయితే బాగుంటుంది అని కొణిదెల టీం లో చర్చలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా ఆ డేట్ అంటే పనులు మొత్తం పూర్తి చేసుకోవడానికి తగినంత సమయం కూడా దొరుకుతుంది. కాని ఖరారుగా ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి.
సైరాకు భారీ గ్రాఫిక్ వర్క్ తో ముడిపడిన సినిమానే. ఒకవేళ సైరా ఆ డేట్ కావాలి అనుకుంటే ప్రభాస్ త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. తాను ముందు రావడమో లేదా దసరాకు ఫిక్స్ చేసుకోవడమో చేయొచ్చు అనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ బడ్జెట్ మూవీస్ గా రూపొందుతున్న సైరా సాహోలకు ఇలా తేది విషయంలో దోబూచులాట మొదలవడం విశేషమే