Begin typing your search above and press return to search.
నా బయోపిక్ లో రామ్ చరణ్ వద్దు-చిరు
By: Tupaki Desk | 3 Oct 2019 11:22 AM GMTబయోపిక్ ల వెల్లువలో స్ఫూర్తివంతమైన ప్రముఖుల జీవితాల్ని వెండితెరకెక్కించేందుకు మన దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి ఇటీవల అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. చిరు లైఫ్ జర్నీ ఎందరికో స్ఫూర్తి. అందుకే ఆయన జీవితంపై సినిమా వస్తే బావుంటుందన్నది ఫ్యాన్స్ ఆశ. ఒకవేళ మెగాస్టార్ బయోపిక్ తెరకెక్కిస్తే అందులో ఎవరు నటించాలి? అంటే .. దానికి చిరునే స్వయంగా ఆన్సర్ చేశారు.
నేడు హైదరాబాద్ లో జరిగిన సైరా సక్సెస్ వేడుకలో చిరుకి ఈ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ నా బయోపిక్ తెరకెక్కిస్తే అందులో రామ్ చరణ్ నటించవద్దు అని అభిప్రాయపడ్డారు. చరణ్ జన్మించే సన్నివేశంలో ఆ పసికందును తనే ఎత్తుకుంటే బావుండదు. అది స్క్రీన్ పై చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే చరణ్ చేయకూడదని అనుకుంటున్నాను అని అన్నారు. ``తను నటిస్తే వందకు వందశాతం న్యాయం చేస్తాడు... కానీ సమస్యలున్నాయి`` అని చిరు అభిప్రాయపడ్డారు. చరణ్ కాకపోతే ఎవరు ఆప్షన్ అని ప్రశ్నిస్తే.. నేను యంగ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటానో ఆ లుక్ సాయిధరమ్ తేజ్-వరుణ్ తేజ్- వైష్ణవ్ తేజ్ లకు ఉంటుందని సన్నిహితులు అంతా అంటుంటారు. వాళ్లలో ఎవరైనా ఓకే అని చిరు అన్నారు.
నా బయోపిక్ తీస్తే నా ఫ్యామిలీ హీరోలే నటించాలని నేను కోరుకుంటున్నాను.. వారికి ఆ పోలికలు ఉంటాయి కాబట్టి అలా భావిస్తున్నాను అని అన్నారు. మీ బయోపిక్ ఆసక్తి రేకెత్తిస్తుందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తే.. ఏమో చెప్పలేం అని అన్నారు. నా కెరీర్ లో లైప్ లో అభిమానులకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. రాజకీయ జీవితంలో నేను చెప్పని విషయాలు చాలానే ఉన్నాయి. వాటిని బయటకు చెప్పడానికి బయోపిక్ అవకాశం కలిగించవచ్చు అని అభిప్రాయపడ్డారు. మెగాస్టార్ బయోపిక్ తెరకెక్కిస్తే నటించేందుకు తమకు ఆసక్తి ఉందని ఇదివరకూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ .. సుప్రీం హీరో సాయిధరమ్ తమ ఆసక్తిని కనబరిచారు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కనుందో చూడాలి. బయోపిక్ ప్రస్థావన వచ్చింది కాబట్టి దానిపై నిర్మాత రామ్ చరణ్ దృష్టి సారించే వీలుందని కూడా టాక్ వినిపిస్తోంది.