Begin typing your search above and press return to search.

3 రోజుల్లో 15 నిమిషాలా.. బాగా స్పీడేమో?

By:  Tupaki Desk   |   26 Sep 2015 1:30 AM GMT
3 రోజుల్లో 15 నిమిషాలా.. బాగా స్పీడేమో?
X
బ్రూస్ లీ మూవీకి మెగా మీటర్ సాంగ్‌ న్యూస్‌ రిలీజ్ చేసి.. చిరంజీవితో షూటింగ్ మొదలైందని చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు శ్రీను వైట్ల. అయితే.. ఈ సినిమాకి చిరంజీవి ఇచ్చిన డేట్స్ మూడు రోజులే అని తెలుస్తోంది. అక్టోబర్ 16 టార్గెట్ అందుకోవడానికి స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారని తెలుసు కానీ.. మరి ఇంత స్పీడా అనిపిస్తోంది.

స్పీడ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే.. బ్రూస్ లీలో చిరంజీవి 15 నిమిషాల పాటు కనిపిస్తారన్న మాట వాస్తవమే. ఇందులో ఒక పాట, ఒక ఫైట్, కొన్ని సన్నివేశాలు ఉంటాయని వైట్ల ఓపెన్ గానే చెప్పాడు. మరిప్పుడు చిరు డేట్స్ ప్రకారం వీటన్నిటినీ 3 రోజుల్లోనే కంప్లీట్ చేయాలి. సాధారణంగా ఒక పాట తీయడానికి వారం పది రోజులు పడుతుంది మన టాలీవుడ్ లో. ఫైట్ కి కూడా దాదాపు అంతే. మరి చిరు - చరణ్ లను స్క్రీన్ మీద చూపిస్తూ... 15 నిమిషాల ఎపిసోడ్ 3 రోజుల్లో పూర్తి చేసేస్తే.. మరి క్వాలిటీ సంగతేంటి అనే డౌట్ వస్తుంది సహజంగానే. కానీ ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం.. పాజిటివ్ గానే ఉంది.

రామ్‌ చరణ్‌ సినిమా ఎలా ఉన్నా పెద్దగా ఎఫెక్ట్ పడదు. కంటెంట్‌ వీక్‌ గా ఉన్న మూవీస్ కే.. మినిమం 40కోట్ల షేర్‌ గ్యారంటీగా వచ్చేస్తోందని ట్రేడ్‌ వర్గాలు ఎప్పటినుండో చెబుతున్నాయి. వాళ్లు వీళ్లు చెప్పడమేంటి.. రచ్చలాంటి యావరేజ్ కంటెంట్ మూవీ పెద్ద హిట్ అవడానికి చెర్రీ క్రేజ్ ఒక్కటే కారణం. గోవిందుడు అందరివాడేలేకి 40 కోట్ల మార్క్ దాటించి.. తన స్టామినాని గతంలోనే ప్రూవ్ చేసేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.