Begin typing your search above and press return to search.
శక్తి దర్శకుడిలో కనిపించని షాడో
By: Tupaki Desk | 13 Oct 2022 3:30 AM GMTసినిమా ప్రపంచంలో సక్సెస్ అయినా ఫెయిల్ అయిన కూడా ఆ ప్రభావం ఎక్కువగా దర్శకుడిపైన పడుతుంది. డిజాస్టర్ వస్తే చాలు ఇటీవల కాలంలో దర్శకుల పేర్లు మళ్లీ వినపడడం లేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే నిలదొక్కుకునేందుకు అవకాశాలు వస్తున్నాయి.
ఇక దర్శకుడు మెహర్ రమేష్ కు ఒకప్పుడు వరుసగా డిజాస్టర్స్ చూడడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక అతనికి మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఊహించిన విధంగా అవకాశం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
మొదట సినిమా ఇండస్ట్రీలో రచయితగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత దర్శకుడుగా మారిన మెహర్ రమేష్ మొదట ఆంధ్రావాలా సినిమాను కన్నడలో రీమిక్స్ చేసి సక్సెస్ కొట్టాడు. తెలుగులో డిజాస్టర్ అయిన కథను కన్నడలో అంతగా ఎలా సక్సెస్ చేశాడు అనేది అందరికీ అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. పూరీ అయితే అతని వర్క్ కు ఫిదా అయ్యాడు. అతన్ని దగ్గరికి తీసుకొని మరి సినిమాలకు రైటర్ గా పెట్టుకున్నాడు.
ముఖ్యంగా అతన్ని పోకిరి సినిమా పూర్తయ్యే వరకు పక్కనే పెట్టుకున్నాడు. మరో రైటర్ గా కూడా అతనికి క్రెడిట్ కూడా ఇచ్చాడు. ఒక శక్తి షాడో లాంటి డిజాస్టర్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ కారణంగా పోకిరి సినిమా సక్సెస్ అయింది అంటే ఎవరు అంత ఈజీగా నమ్మరు. కానీ అతని ఇంపాక్ట్ అయితే ఆ సినిమా మీద చాలా ఎక్కువగానే ఉంది. అంతకు ముందు దేశముదురు సినిమాకు కూడా పూరి దగ్గర వర్క్ చేశాడు.
అయితే బిల్లా సినిమాతో పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత శక్తి షాడో సినిమాలు అతన్ని నిలదొక్కుకునేలా చేయలేకపోయాయి. అతనిలో టాలెంట్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవి ముందుగానే గమనించి మళ్లీ వేదళంను రీమేక్ అవకాశం ఇచ్చారు.
మెగాస్టార్ అయితే అతనిలో కనిపించని షాడో ఒకటి ఉంది అని నమ్ముతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ పై కాస్త నమ్మకంగానే ఉన్నారట. అందుకే అతనిపై ఎంత నెగిటివిటి ఉన్నా కూడా సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి మెహర్ రమేష్ ఆడియన్స్ అంచనాలను ఇంతవరకు అందుకుంటాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.