Begin typing your search above and press return to search.

తేజు మూవీకి చిరు ఐ లవ్యూ చెబుతారా?

By:  Tupaki Desk   |   1 Jun 2018 9:24 AM GMT
తేజు మూవీకి చిరు ఐ లవ్యూ చెబుతారా?
X
మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా వేడుకకు చీఫ్ గెస్టుగా పిలవడం అంటే.. ముందుగా ఆయా మూవీ మేకర్స్ కు.. అందులో నటించిన హీరోకు మాంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే.. ఆయన మాటల్లోనే జనాలు ముఖ్యంగా అభిమానులు సినిమా రిజల్ట్ ను పసిగట్టేస్తారు.

ఓ సినిమా ఫలితాన్ని ముందే పసిగట్టడంలో దిట్ట అయిన చిరు.. తన కుటుంబంలోని హీరోల సినిమా ఫంక్షన్స్ అయినా సరే.. అన్నిటికీ హాజరు కాని విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన తేజ్ ఐలవ్యూ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి.. తొలి పాటను రేపు రిలీజ్ చేయనుండగా.. జూన్ 9న ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్టుగా ఆహ్వానించారట. ఆయన కూడా వెంటనే అంగీకరించేశారట. ప్రస్తుతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తేజుకు.. మెగాస్టార్ వచ్చి ప్రచారం చేయడం కలిసొచ్చే విషయమే.

పైగా మూవీ రిజల్ట్ పై అంతో ఇంతో నమ్మకం ఉంటేనే.. ఇలా వేడుకకు వచ్చేందుకు అంగీకరిస్తారు మెగాస్టార్. ఆ రకంగా తేజ్ ఐలవ్యూ పై పాజిటివ్ అంచనాలు పెరగడానికి మెగాస్టార్ ఎంట్రీ కారణం కానుంది. మరోవైపు.. చాలా సినిమాల తర్వాత.. అది కూడా చిరు-పవన్ లను ఇకపై ఇమిటేట్ చేయకూడదని తేజు ఫిక్స్ అయిన తర్వాత.. తేజ్ ఐలవ్యూ ఆడియో వేడుక జరగనుండగా.. దీనికి చిరు ముఖ్య అతిథిగా రావడం హైలైట్ కానుంది.