Begin typing your search above and press return to search.

శతమానం వేడుక.. చిరు చెబ్తారా?

By:  Tupaki Desk   |   18 Dec 2016 4:50 AM GMT
శతమానం వేడుక.. చిరు చెబ్తారా?
X
యంగ్ హీరో శర్వానంద్ కొత్త సినిమా శతమానం భవతి రిలీజ్ కి రెడీ అయిపోతోంది. 2017 సంక్రాంతి రేసులో తామున్నామంటూ శతమానం మేకర్స్ ముందు నుంచే చెబుతున్నారు. చెప్పినట్లుగానే వస్తున్నారు కూడా. ఖైదీ నెంబర్ 150.. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు పోటీ పడుతున్నా సరే.. మధ్యలో వచ్చే తమ ఫ్యామిలీ మూవీకి ఢోకా ఉండదన్నది వీరి నమ్మకం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శతమానం భవతి.. ఇవాళ సాయంత్రం ఆడియో రిలీజ్ వేడుక జరుపుకోనుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల విశాల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. మీడియం బడ్జెట్ మూవీగా తెరకెక్కే చిత్రానికి ఇంత భారీ ఫంక్షనా అనుకోవచ్చు కానీ.. అసుల విషయం ఏంటంటే.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని తెలుస్తోంది. అందుకే భారీ ఫంక్షన్ ఏర్పాటు చేశాడట నిర్మాత. ఏ వేడుకలో అయినా.. ఆయా నటులు.. టెక్నీషియన్స్ ను చిరు మనసారా అభినందిస్తారనే సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు చిరు నుంచి మెగాభిమానులు మరిన్ని విషయాలు కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అందులో ప్రధానమైనది ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన ఆడియో ఫంక్షన్ స్టేటస్. ఖైదీ ఆడియో వేడుక రద్దు చేశారనే టాక్ నడుస్తుండడంతో.. దీనికి శతమానం భవతి వేడుకగా మెగాస్టార్ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు చాలామంది. ఒకవేళ ఆయన స్వయంగా చెప్పకపోయినా.. మెగాఫ్యాన్స్ ఒకటికి రెండు సార్లు అడిగితే మాత్రం చెప్పేస్తారులే. ఫ్యాన్స్ మాట మెగాస్టార్ ఎప్పుడూ కాదనలేరు కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/