Begin typing your search above and press return to search.

2500 కోట్ల‌లోంచి 500కోట్లు చిరంజీవికే

By:  Tupaki Desk   |   4 Sep 2015 7:16 PM GMT
2500 కోట్ల‌లోంచి 500కోట్లు చిరంజీవికే
X
బుల్లితెర సంచ‌ల‌నం మాటీవీని స్టార్ టీవీ టేకోవ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో మా టీవీ యాజ‌మాన్యంతో స్టార్ టీవీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 2500 కోట్లు. త్వ‌ర‌లోనే ఈ డీల్‌ని సెటిల్ చేసుకుని క్లోజ్ చేసేందుకు స్టార్ టీవీ యాజ‌మాన్యం పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే ఎఫ్ ఐ పీబీ (ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్ర‌మోష‌న్ బోర్డ్‌) నుంచి ఆమోదం ల‌భించింది. మొత్తం డ‌బ్బును మాటీవీ యాజ‌మాన్యానికి చెల్లించేసేందుకు స్టార్ టీవీ రెడీ అవుతోంది. అయితే ఈ డీల్ వ‌ల్ల ఎవ‌రికి ఎంత లాభం? ఏ జేబులోకి ఎంత వెళుతోంది? అన్న లెక్క‌లు తీస్తే దిమ్మ తిరిగే నిజాలెన్నో తెలిసొచ్చాయి.

మాటీవీ షేర్స్‌ లో వాటాల ప్ర‌కారం సంస్థ ఛైర్మ‌న్ నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ వాటా 65 శాతం, మెగాస్టార్ చిరంజీవి వాటా 20శాతం, నాగార్జున వాటా 10 శాతం ఉన్నాయి. ఆ మేర‌కు లెక్క‌లు తీస్తే మెగాస్టార్ చిరంజీవికి 500కోట్లు ముడుతోంది. అందులో స‌గం అంటే 250 కోట్లు నాగార్జున అకౌంట్లోకి వెళుతున్నాయి. ఇక మిగ‌తా దాంట్లో మెజారిటీ భాగం నిమ్మ‌గ‌డ్డ అకౌంట్లోకి చేరుతుంది. బాస్ అల్లు అర‌వింద్ స‌హా ప‌లువురు పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇందులో పెట్టుబ‌డులు ఉన్నాయి. అయితే అవ‌న్నీ చిన్న వాటాలు.

మొత్తానికి మెగాస్టార్ ష‌ష్టిపూర్తి చేసుకుని హుషారుగా ఉన్న ఈ వేళ‌లో మంచి శుభ‌వార్తే అందింది. ఒకేసారి 500కోట్లు అకౌంట్లోకి రావ‌డ‌మంటే ఆషామాషీనా. అస‌లు మాటీవీ ఫ్లాష్‌ బ్యాక్‌ లో కి వెళితే ఈ సంస్థ కేవ‌లం 10 కోట్ల పెట్టుబ‌డితో మొద‌లైంది. ప్రారంభం ముర‌ళీ కృష్ణంరాజు ఛైర్మ‌న్‌ గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత ఆయ‌న్నుంచి నిమ్మ‌గ‌డ్డ టేకోవ‌ర్ చేశారు. ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా మాటీవీ ఎదిగి చివ‌రికి ఇంత అయ్యింది. ఇప్పుడు వంద‌ల కో్ట్డట్ల రేంజుకి ఎదిగి య‌జ‌మానుల‌కు భారీ లాభాల్ని తెచ్చింది. తెలుగు టీవీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించినంత వ‌ర‌కూ అతి పెద్ద డీల్ ఇదే.