Begin typing your search above and press return to search.

బ‌న్నీ వ‌ర్సెస్ మహేష్‌.. మ‌ధ్య‌లో చిరు

By:  Tupaki Desk   |   21 Feb 2018 11:45 AM GMT
బ‌న్నీ వ‌ర్సెస్ మహేష్‌.. మ‌ధ్య‌లో చిరు
X
టాలీవుడ్‌లో మ‌హేష్ బాబు, అల్లు అర్జున్... ఇద్ద‌ర హీరోల‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటూ... మంచి మార్కెట్ కూడా ఉంది. ఆ రెండు కొండ‌లు ఒకేసారి ఢీ కొట్టుకోవ‌డానికి సిద్దంగా ఉన్నాయి. వారిద్ద‌రి సినిమాలు ఒకేరోజు విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్లు ప్ర‌క‌టించాయి. ఏ ఒక్క‌రూ కూడా వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. దీంతో ఈ ట‌గ్ ఆఫ్ వార్‌ లోకి చిరు ఎంట్రీ ఇచ్చాడు.

వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా నా పేరు సూర్య‌. అల్లు అర్జున్ సైనికుడిగా న‌టిస్తున్న మూవీ. ఇక మ‌హేష్ చేసిన భ‌ర‌త్ అను నేను రాజ‌కీయ మూవీ. తొలిసారి రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌పైనా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కానీ మొద‌ట్నించి విడుద‌ల తేదీ విష‌యంలో ఈ రెండు సినిమాలూ పోటీ ప‌డుతూ వ‌స్తున్నాయి. మొద‌ట రెండూ సినిమాల‌ను ఏప్రిల్ 27నే విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో అల్లు అర్జున్ సినిమాను ఒక రోజు ముందు ఏప్రిల్ 26న విడుద‌ల చేస్తామ‌ని నా పేరు సూర్య సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ ఏమైందో కానీ భ‌ర‌త్ అను నేను టీమ్ కూడా త‌మ విడుద‌ల తేదీని ఏప్రిల్ 26కే మార్చింది.

రెండు సినిమాల నిర్మాత‌లు ఎందుకిలా ట‌గ్ ఆఫ్ వార్ ఆడుతున్నారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. నా పేరు సూర్య సినిమాకు ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌... బ‌న్నీ వాసు...నాగ‌బాబు నిర్మాత‌లుగా ఉన్నారు. ఇక భ‌ర‌త్ అను నేనుకు డివివి దాన‌య్య నిర్మాత‌. మెగా ఫ్యామిలీతో దాన‌య్య‌కు మంచి రిలేష‌నే ఉంది. గ‌తంలో దేశ‌ముదురు - వ‌రుడు - జులాయి - నాయ‌క్‌ - బ్రూస్ లీ - కెమెరామెన్ గంగ‌తో రాంబాబు సినిమాల‌ను తీశాడు.

నా పేరు సూర్య నిర్మాత‌లు తామే మొద‌ట విడుద‌ల తేదీ ప్ర‌క‌టించాం క‌నుక వెన‌క్కి త‌గ్గేది లేదంటున్నారు. విడుద‌ల తేదీ కాస్త వెన‌క్కి మారిస్తే... త‌మ రెవెన్యూను మ‌రో పెద్ద సినిమా తినేస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. దాన‌య్య మాత్రం ఏం మాట్లాడ‌కుండా.... విష‌యాన్ని చిరంజీవికి చేర‌వేశారట. దాన‌య్య వెర్ష‌న్ విన్న చిరు... నాగ‌బాబును... బ‌న్నీ వాసును త‌న ఇంటికి రావాల్సిందిగా కోరారట. ఆయ‌నే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని ఇస్తాడేమో అని ఆశ‌ప‌డుతున్నారు సినీ జ‌నాలు.