Begin typing your search above and press return to search.

ఎనిమిది మంది హీరోయిన్లతో చిరు రొమాన్స్..?

By:  Tupaki Desk   |   8 Jun 2023 7:00 PM GMT
ఎనిమిది మంది హీరోయిన్లతో చిరు రొమాన్స్..?
X
ఒక సినిమాలో ఇద్దరు , లేదంటే ముగ్గురు హీరోయిన్లు ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరో డ్యూయల్, త్రిబుల్ రోల్స్ ప్లే చేసినప్పుడు హీరోయిన్లను తీసుకుంటూ ఉంటారు. లేదంటే కథపరంగా అవసరమైనప్పుడు కూడా ఇలా ఇద్దరు, ముగ్గరు హీరోయిన్లను తీసుకుంటూ ఉంటారు. కానీ ఒకే సినిమాలో ఒక్క హీరో ఎనిమిది మంది హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా? త్వరలోనే చూడబోతున్నారు.

మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమాలో ఇది సాధ్యం కాబోతోంది. చిరు సినిమాలో ఎనిమిది మంది హీరోయన్లు ఉండబోతున్నారట. ఏదో ఒక పాటలో కనిపిస్తారు అనుకుంటే పొరపాటే. వాళ్లంతా సినిమా మొత్తం ఉంటారట. వారి పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుందట.

ఇంతకీ మ్యాటరేంటంటే, ప్రస్తుతం చిరు బోళా శంకర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఆయన వరస పెట్టి సినిమాలు చేయనున్నారు. దానిలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మూవీ కూడా ఉంది. మరో మూవీకి వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. కాగా, బింబిసార మూవీతో కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్టతో చిరు సినిమా చేయడానికి అంగీకరించారు.

ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందట. ఈ క్రమంలోనే ఈ మూవీలో ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. మూవీ ప్రారంభించడానికి ముందే ఆ హీరోయిన్ల వేటలో దర్శక నిర్మాతలు పడటం విశేషం. ఏ పాత్రకు ఎవరైతే బాగుంటారా అని వెతుకుతున్నారట. అయితే, ఎనిమిది మందీ స్టార్ హీరోయిన్లు కాదు. కొందరు స్టార్ హీరోయిన్లు ఉంటే, మరి కొందరు కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందట.

ఇక కళ్యాణ్ కృష్ణతో సినిమా, మరో వైపు వశిష్టతో సినిమా రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించాలని చిరు అనుకుంటున్నారట. మరి ఈ ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభమౌతాయో చూడాలి. ఇదిలా ఉండగా, చిరు బోళా శంకర్ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయన సరసన తమన్నా, చెల్లిలిగా కీర్తి సురేష్ నటించారు. ఆగస్టులో విడులకు ప్లాన్ చేస్తున్నారు.