Begin typing your search above and press return to search.
చిరు పైలట్ అయ్యాడు
By: Tupaki Desk | 21 Sep 2015 10:30 PM GMTతెరపైనే కాదు... నిజ జీవితంలోనూ సాహసాలు చేస్తుంటాడు చిరంజీవి. రియల్ ఫైట్లు - బంగీ జంప్ లు - స్కై డైవింగులు... ఇలా చాలానే చేశాడాయన. పాత్ర డిమాండ్ చేసిందని తెలిస్తే చాలు... ఎంత రిస్కయినా స్పెషల్ ట్రైనింగులు తీసుకొని మరీ ఆయన రంగంలోకి దిగుతుంటాడు. చిరంజీవి కున్న కమిట్ మెంట్ అలాంటిది. అయితే తాజాగా ఏ పాత్ర డిమాండ్ చేయకపోయినా ఓ ప్రయత్నం చేశాడు. ఫ్లైట్ పైలట్ అయ్యాడు. ఫ్లైట్ కాక్ పిట్ లోకి దూరి పైలట్ అవతారమెత్తాడు. చిరు ఫ్లైట్ నడిపింది నిజమో కాదో తెలియదు కానీ... కాక్ పిట్ లో కూర్చుని ఫ్లైట్ నడుతున్నట్టుగా ఉన్న చిరు ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఫ్లైట్ నడపాలంటే లైసెన్స్ గ్యారెంటీ. హీరోల్లో పైలట్ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్కడు అజిత్ అని సమాచారం. మరి ఇటీవల చిరు కూడా ఆ లెసెన్స్ తీసుకొన్నారేమో మరి.
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ట్రూ జెట్ పేరుతో ఓ ఏవియేషన్ సంస్థని నడుపుతున్నాడు. ఆయనకి చాలా ఫ్లైట్లున్నాయి. తనయుడి ఫ్లైట్ కంపెనీకి చెందిన ఏదైనా కార్యక్రమంలో చిరు పాల్గొని అలా పోజులిచ్చాడా? లేక నిజంగానే ఫ్లైట్ నడిపాడా అన్నది తేలాల్సి వుంది. చిరుని పైలట్ గా చూస్తూ మాత్రం అభిమానులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.