Begin typing your search above and press return to search.
సైరా అదొక్కటే చిక్కురా!!
By: Tupaki Desk | 18 Sep 2018 6:38 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి టీమ్ ప్రస్తుతం జార్జియాలో ఉన్న సంగతి తెల్సిందే. నిన్న సెట్ తాలూకు ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ కూడా అయ్యాయి. రేపో ఎల్లుండో చిరు కూడా జాయిన్ అయిపోతారు. షూటింగ్ మొదలుపెట్టడం ఆలస్యం అయినా చిన్న చిన్న అడ్డంకులు తప్ప అనుకున్న ప్లాన్ ప్రకారం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నాడు సూరి. కానీ ఒక్క విషయం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతోందట. చిరు ఇటీవలే భుజానికి సర్జరీ చేయించుకున్న కారణంగా రోజువారీగా చేసే ఎక్స్సర్ సైజులకు తాత్కాలికంగా విరామం ఇచ్చేసారు. దీంతో సహజంగానే బరువుపై ప్రభావం పడుతుంది కాబట్టి ఆ మేరకు కొద్దిగా పెరిగారట. దీంతో నరసింహరెడ్డి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉండే ఎపిసోడ్స్ లో చిరు లుక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న కారణంతో వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయంలో టీమ్ తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. ఎంత మెగాస్టార్ అయినా ఆరు పదులు దాటిన వయసు కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరం.
ఈ నేపధ్యంలో బాహుబలిలో అనుష్కకు కొన్ని సన్నివేశాల్లో సహజత్వం కోసం ఉపయోగించిన టెక్నాలజీనే సైరాకు కూడా వాడే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. చిరుని శరీరపరంగా ఎక్కువ రిస్క్ లో పెట్టడం మంచిది కాదు. రామ్ చరణ్ సైతం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూరికి పదే పదే సూచించాడట. వాయిదా వేసే అవకాశం లేదు. ఇతర ఆర్టిస్టులందరూ భారీ డిమాండ్ ఉన్న వాళ్ళు కావడంతో తర్వాత కాల్ షీట్స్ దొరకడం ఇబ్బందిగా మారుతుంది. సో ఏదోలా మేనేజ్ చేసి ఆటంకం లేకుండా చూస్తున్నారని తెలిసింది. రత్నవేలు ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్టు వినికిడి. ఖైదీ నెంబర్ 150లో చిరు ఛరిష్మాని చూపించిన తీరు అందరి చేత మెప్పు పొందింది. ఇందులో కూడా ఎలాంటి రిమార్క్ రాకుండా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చాడట. ముందే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీసుకుంటే ఈ చిక్కొచ్చేది కాదు కానీ ఇప్పుడు మాత్రం సూరి మీద పెద్ద బాధ్యతే ఉంది.