Begin typing your search above and press return to search.
చిరు ప్రయోగం.. పొంచి ఉన్న ప్రమాదం
By: Tupaki Desk | 12 May 2017 7:31 AM GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి తిరిగి వస్తున్నారు అన్నప్పటినుండి అందరిలోనూ యెస్ బాస్ ఈజ్ బ్యాక్ అనే భావమే ఉంది. ఖైదీ 150 తో అది ఋజువు అయ్యింది. ఈ సినిమాతో మళ్ళీ చిరు పూర్వ వైభవం తెచ్చి పెట్టింది. దాన్నితో మళ్ళీ సంశయంలో పడ్డారు చిరంజీవి. ఇప్పుడు తను నమ్ముకున్న కమర్షియల్ సినిమా వైపా లేక కథ బలం ఉన్న సినిమా వైపా అని ఆలోచిస్తూ.. చిరంజీవి రెండో దాన్నికి ఓటు వేశారు. అందుకే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి అనే ఒక పోరాట యోధుడు కథతో వస్తున్నారు.
సినిమా కథ ఎంపిక బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు అతిగా ఆలోచించి కొత్త కొత్త ఆలోచనలతో తెలియని ప్రమాదాలు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ దశ లోనే ఉండటంతో నటీనటుల ఎంపిక కూడా జరగలేదు. అప్పుడే ఈ సినిమాని తమిళ్ తెలుగు లో ఒకే సారి విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి అనే ఒక వీరుడు కథ మన తెలుగు వాళ్ళకే సరిగా తెలియదు ఇప్పుడు తమిళ్ లో కూడా ఈ కథతో వెళ్ళితే ఎలా ఉంటుందో అసలు చెప్పలేం. నిర్మాణ సంస్థ ఉద్దేశ్యం ఏంటి అంటే చిరంజీవికి తమిళ్ లో ఒకప్పుడు ఫాన్స్ బాగానే ఉన్నారు. ఇప్పుడు బాహుబలి లా మార్కెటింగ్ చేసి ఎక్కువ మందికి ఈ కథ చేరేలా చేద్దామనే ఆలోచన బాగానే ఉంది కానీ ప్రీ ప్రొడక్షన్ పూర్తి కానీ సినిమాని దాని విడుదల ఎలా చేద్దాం ఎవ్వరితో చేద్దాం ఎక్కడక్కడ చేద్దాం అని ఆలోచించడం కాస్త పేక మేడ కడుతునట్లు అనిపిస్తోంది.
మంచి కథ కథనం ఉంటే అది ఏ భాషైన చూస్తారని బాహుబలితో ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. ఇప్పుడు చాలా మంది రెండు మూడు భాషలో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు అవసరం లేకపోయాన కూడాను. ఇప్పుడు రామ్ చరణ్ నిర్మాతగా సురేంద్ర రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కూడా అదే చట్రం లో పడి కొట్టుకుపోతుంది. చూద్దాం మెగాస్టార్ దీనికి ఎలా ఉపయోగపడతారో లేక తమిళంలో కూడా తీసి అనవరసంగా వాతలు పెట్టుకుంటారో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/