Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడ.. దాదాపు అలానే..

By:  Tupaki Desk   |   5 May 2017 11:20 AM GMT
ఉయ్యాలవాడ.. దాదాపు అలానే..
X
సినిమాల నుంచి విరామం తీసుకుని రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో కలెక్షన్ల దుమ్ము దులిపేశాడు. తర్వాత 151వ సినిమా ఏం చేయబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఓకే చేశారు. ఇదే పేరుతో సినిమా తీయాలని సంకల్పించి రచనా బాధ్యతలు పరుచూరి బ్రదర్స్ కు అప్పగించారు. దాదాపు ఏడాదిపాటు కుస్తీపట్టి పరుచూరి బ్రదర్స్ ఇందుకు సంబంధించిన స్ర్కిప్ట్ ను సిద్ధం చేశారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో చిత్రయూనిట్ కు కొత్తగా ఓ సందేహం పుట్టుకొచ్చింది. అదేంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ మొత్తం తమిళ వీరుడు వీరపాండ్య కట్టబొమ్మన చరిత్రను పోలి ఉందట. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆయన సొంత మనుషులే వెన్నుపోటు పొడిచి నల్లమల అడవుల్లో బ్రిటిష్ వారికి పట్టించారు. తర్వాత బ్రిటిష్ వారు నరసింహారెడ్డిని ఉరి తీశారు. తమపై తిరుగుబాటు చేసేవారికి వణుకు పుట్టేవిధంగా ఆయన తలను 30 ఏళ్లపాటు కోటకు వేలాడదీసే ఉంచారు. 1790లో తమిళనాడుకు చెందిన నాయక రాజు వీరపాండ్య కట్టబొమ్మన కూడా బ్రిటిష్ వారి ఏలుబడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆయనను కూడా సొంత మనుషులే వెన్నుపొటు పొడిచారు. 15 రోజుల పాటు చిత్రవధలకు గురిచేసి ఆ తర్వాత ఉరితీశారు. ఇప్పటికీ కట్టబొమ్మనకు చెందిన గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ గాథతో సినిమాలు సైతం వచ్చాయి.

ఈ నేపథ్యంలో కట్టబొమ్మన కథకు భిన్నంగా ఉయ్యాలవాడ జీవితంలో జరిగిన అంశాలేమిటనే దానిపై యూనిట్ దృష్టి పెట్టింది. దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయితలు పరుచూరి బ్రదర్స్ మరికొందరు రచయితల బృందందో కలిసి దీనికి సంబంధించిన అంశాలపై పరిశోధన సాగిస్తున్నారు. వారి శ్రమ వెండితెరపై ఎంతవరకు ప్రతిఫలిస్తుందో వేచిచూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/