Begin typing your search above and press return to search.

వీణ స్టెప్పుపై ఈ మెగా రూమర్ నిజమేనా?

By:  Tupaki Desk   |   8 Aug 2016 11:30 AM GMT
వీణ స్టెప్పుపై ఈ మెగా రూమర్ నిజమేనా?
X
ఆ మధ్య కాలంలో ఎందుకో ఈ వీణ వైరస్ టాలీవుడ్ అంతా కుట్టేసింది. టూ స్టార్ట్ విత్.. ముందుగా పవన్ కళ్యాన్‌ 'సర్దార్' సినిమాలో వీణ స్టెప్ వేశాడు. ఆయన ఆ స్టెప్పును ఎంచుకుని డ్యాన్సు చేస్తాడని ఎవరైనా అనుకున్నారేంటండీ? ఆ తరువాత హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒక అవార్డుల ఫంక్షన్లో వీణ వాయించేసింది. తరువాత ప్రగ్యా జైస్వాల్.. మన్నారా చోప్రాలు కూడా వీణ స్టెప్ వేయసాగారు.

ఇప్పుడు ఈ వైరస్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను కూడా తాకిందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో సునీల్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు. అయితే గతంలో ఎలాగైతే ఠాగూర్ సినిమాలో వీణ స్టెప్ యాజిటీజ్ గా దించేశాడో.. ఇప్పుడు కూడా మళ్లీ అదే స్టెప్పు వేస్తున్నాడట. ఈ సందర్భంగా స్వయంగా చిరంజీవికి సునీల్ ఒక ఎడ్వయిజ్ ఇచ్చాడట. మొన్న మా టివి అవార్డ్స్ లో కుర్రాళ్ళందరం వీణ స్టెప్ వేశాం కదా అన్నయ్యా.. ఇప్పుడు సినిమాలో కూడా అలాగే చేద్దామా అన్నాడట. దానితో కనక్ట్ అయిపోయిన చిరంజీవి.. వెంటనే సాయిధరమ్ తదితరులను వీణ స్టెప్ షూటింగ్ కోసం ప్రిపేరవ్వమని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక్కడ ఇంకో ట్విస్టు ఏంటంటే.. తన చుట్టూ ఉన్న కుర్ర హీరోలందరూ వీణ స్టెప్ వేస్తే.. చిరంజీవి మాత్రం లారెన్స్ కంపోజ్ చేసిన మరో కొత్త స్టెప్ వేస్తారట. చూద్దాం ఈ రూమర్లో ఎంతవరకు నిజముందో మరి.