Begin typing your search above and press return to search.
మెగాస్టార్ యాడ్ లో ఒకలా రియల్ గా వేరేలా...!
By: Tupaki Desk | 6 Aug 2020 5:33 PM GMTమెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి వైరస్ గురించి అవగాహన కలిగిస్తూ వస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ అవుతుందని భావించి అందరి కంటే ముందే షూటింగ్స్ ఆపేయాలని సూచించారు. ఈ క్రమంలో ఓ వైపు కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటూనే మరోవైపు కరోనా గురించి అవేర్నెస్ కలిగిస్తూ వచ్చారు. టాలీవుడ్ లోని మిగతా హీరోలతో కలిసి కరోనాపై యుద్ధానికి సాంగ్ కూడా రెడీ చేపించిన మెగాస్టార్ సామాజిక దూరం పాటించాలని చెబుతూ వచ్చారు. రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోవడం మంచింది కాదని షూటింగ్స్ కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా కరోనా సమయంలో మాస్కుల ప్రాధాన్యతను తెలియజేస్తూ.. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తూ యాడ్స్ లో కూడా నటించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ యాడ్ లో ఒకలా రియల్ గా వేరేలా ఉంటారా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవిని హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. అయితే ఈ సందర్భంగా చిరు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మీడియాకి వచ్చిన ఫోటోలలో వీడియోలలో చిరంజీవి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మాస్కు ధరించి కనిపించారు. ఆ తర్వాత సోము వీర్రాజు భుజం మీద చిరు చేయివేసి దిగిన మరికొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. ఆ సమయంలో మెగాస్టార్ సామాజిక దూరం పాటించకుండా మాస్క్ లేకుండా ఉన్నారు. దీంతో చిరు కరోనా గురించి అవగాహన కలిగిస్తూ యాడ్స్ లలో నటిస్తారు కానీ ఆయన మాత్రం వాటిని పాటించారు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం చిరు అప్పటికే శానిటైజ్ చేసుకుని ఉంటారు.. అందుకే ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి ఫోటో దిగి ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.