Begin typing your search above and press return to search.

చిరు వాయిస్ మాత్రం తేడానే..

By:  Tupaki Desk   |   21 Aug 2018 1:24 PM GMT
చిరు వాయిస్ మాత్రం తేడానే..
X
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ ఈ రోజే లాంచ్ అయింది. చిరును ఉయ్యాల వాడ నరసింహారెడ్డిగా చూసిన అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. టీజర్ వాటిని మరింత పెంచింది.

విజువల్స్, బ్యాగ్రౌడ్ స్కోర్, ఇంకా సాంకేతిక ఆకర్షణలన్నీ కూడా చాలా బాగా కుదిరినట్లే కనిపిస్తోంది. ఐతే అన్నీ బాగున్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం కొంచెం అసంతృప్తి కనిపిస్తోంది. అదే మెగాస్టార్ వాయిస్. టీజర్లో చిరు ఒకే ఒక్క చిన్న డైలాగ్ చెప్పాడు. ‘‘ఈ యుద్ధ ఎవరిది..?’’ అని. దానికి మనది అని ఉయ్యాలవాడ సైన్యం బదులిస్తుంది. ఐతే ఈ డైలాగ్ చెప్పడంలో ఉండాల్సినంత ఫోర్స్ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మామూలుగా చిరు వాయిస్ బాగానే ఉంటుంది కానీ.. ఆవేశపూరితమైన డైలాగులు చెప్పేటపుడు ఆయన కొంచెం వీకే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ‘ఇంద్ర’లో అన్నీ బాగున్నా చిరు పౌరుషంతో కూడిన డైలాగులు చెప్పడంలో కొంచెం బలహీనంగానే కనిపిస్తాడు. అందులోనూ ఇప్పుడు చిరుకు కొంచెం వయసు మీద పడటంతో వాయిస్ తేడా వచ్చింది. ‘ఖైదీ నంబర్ 150’లోనూ ఆవేశపూరితమైన డైలాగ్స్ చెప్పినపుడు ఫోర్స్ కనిపించలేదు. ‘సైరా’ టీజర్లోనూ ఆ డైలాగ్ అలాంటి ఫీలింగే కనిపించింది. నిజానికి ‘సైరా’ ఒప్పుకున్నాక చిరు వాయిస్ ఎక్సర్‌ సైజులు కొన్ని మొదలుపెట్టినట్లు సమాచారం. కాబట్టి పూర్తి సినిమాకు డబ్బింగ్ చెప్పేటపుడు వాయిస్‌లో ఏమైనా మార్పు చూపిస్తారేమో చూడాలి. కానీ టీజర్లో ఉన్నట్లే ఉంటే మాత్రం అది సినిమాకు కొంచెం మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.