Begin typing your search above and press return to search.
చిరు వర్సెస్ బాలయ్య.. ఆ వేదిక అన్నిటికీ పరిష్కారం!
By: Tupaki Desk | 5 Jun 2020 3:30 AM GMTమెగా వర్సెస్ నందమూరి వార్ గురించి తెలిసిందే. దశాబ్ధాలుగా ఇరు కుటుంబాల మధ్య పరిశ్రమలో వృత్తిగతమైన ఆధిపత్య పోరు చూస్తున్నదే. ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య బాహాబాహీ ప్రతిసారీ బయటపడుతూనే ఉంది. అయితే ఇటీవల కొన్నేళ్లుగా స్థబ్ధుగా ఉండడంతో ఆ ఇరువురి మధ్యా క్లాషెస్ తొలగిపోయాయని అంతా భావించారు. వేదికలపై స్నేహంగా కలుసుకోవడంతో గొడవలేవీ లేవనే భావించారు. కానీ అనూహ్యంగా కరోనా మమమ్మారీ లాక్ డౌన్ వేళ రకరకాల విషయాలు బయటపడ్డాయి. మెగా నందమూరి చెలిమి నీటి మూట లాంటిదేనని జనాలకు అర్థమైంది.
రాజకీయంగా ఎన్ని ఉన్నా కానీ వ్యక్తిగత కక్షలు లేవనే అనుకున్న వారికి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఉన్నట్టుండి పరిశ్రమ పెద్దరికం వ్యవహారం మీడియాలో హైలైట్ కావడంతో ఆ ఇద్దరి మధ్యా నువ్వా నేనా? అన్న గొడవ మొదలైంది. కరోనా కష్ట కాలంలో సీసీసీ ట్రస్ట్ ప్రారంభించి సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నించారు. అలాగే ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో సినీపరిశ్రమ సమస్యల్ని పరిష్కరించేందుకు నేనున్నాను అంటూ ఆయన ముందుకొచ్చారు. దాసరి తర్వాత నేనున్నాను అన్న భరోసాని కల్పించారు.
ఆ తర్వాతా ఈ కష్ఠకాలంలో పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. షూటింగుల పునప్రారంభ వ్యవహారం సహా థియేటర్లు తెరిచే అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో మంతనాలు సాగించారు. అయితే ఇంత కీలకమైన భేటీ విషయంలో చిరంజీవి ఒంటెద్దు పోకడలకు వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. చర్చలకు తనను పిలవకపోవడంతో బాలయ్య హర్ట్ అవ్వడం.. అటుపై మెగాస్టార్ పై తీవ్రమైన కామెంట్ చేయడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ``వారంతా భూములు పంచుకోవడానికి సమావేశం అవుతున్నార``ని అటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలపైనా.. ఇటు చిరంజీవిపైనా బాలయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా మెగాబ్రదర్ నాగబాబు రంగంలోకి దిగి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ``నువ్వేమీ కింగ్ వి కాదు.. కేవలం హీరోవి!!`` అంటూ తీసిపారేసినట్టే మాట్లాడారు. దీంతో రచ్చ మరింత ముదిరింది. ఫ్యాన్స్ మధ్య వార్ కి ఇది ఆజ్యంపోసింది.
దానికి కొనసాగింపుగానే బాలయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాత విషయాల్ని తవ్వి తీసి నాగబాబు- చిరంజీవి బ్రదర్స్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మా భవంతి నిర్మాణం.. ఐదు కోట్ల వ్యవహారం!! అంటూ వివాదాల్ని బయటికి లాగే ప్రయత్నం చేశారు. నాగబాబు కామెంట్స్ పట్టించుకోలేదంటూనే లోతైన విషయాల్ని మాట్లాడారు బాలయ్య. అయితే ఈ వివాదం ఇలానే కొనసాగితే పరిశ్రమకు ఏమంత మంచిది కాదన్నది అందరి అభిప్రాయం. మరి దీనికి చెక్ పెట్టేది ఎప్పుడు? చిరు - బాలయ్య కలిసిపోతారా లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది.
అయితే అన్నిటికీ ఓ సొల్యూషన్ ఉందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు వేడుకలు సేమ్ టైమ్ షష్ఠిపూర్తి వేడుకలు(60వ బర్త్ డే) నిర్వహించేందుకు నందమూరి వర్గాలు ప్లాన్ చేస్తున్నాయిట. ఇప్పటికే బాలయ్య బర్త్ డే డీపీ సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తోంది. ఇక షష్ఠిపూర్తి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దల సమక్షంలో జరిగేది. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమ ప్రముఖులందరినీ పిలుచుకుని ఈ వేడుకను జరుపుకున్నారు. అదే తీరుగా బాలయ్య కూడా అందరినీ ఆహ్వానిస్తారనే భావిస్తున్నారు. అందరినీ పిలిచినప్పుడు టాలీవుడ్ పెద్దగా చిరంజీవిని కూడా ఆహ్వానిస్తారా? లేదా? ఒకవేళ బాలయ్య పిలిచినా దానికి చిరు స్పందిస్తారా లేదా? అంటూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఒకవేళ ఈ వేడుకకు బాలయ్యనే స్వయంగా చిరుని ఆహ్వానించి కలుపుకుంటే.. చిరు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తే అన్ని గొడవలకు ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. మరి ఏం జరగనుందో ఇప్పటికైతే సస్పెన్స్.