Begin typing your search above and press return to search.
చిరంజీవి VS నాగార్జున మరియు పవన్ కళ్యాణ్
By: Tupaki Desk | 22 Aug 2022 4:28 AM GMTమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల యొక్క విడుదల తేదీల విషయంలో క్లారిటీ వచ్చింది. మొదటగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా ను అక్టోబర్ 5వ తారీకున దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడంతో మెగా అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
చిరంజీవి గాడ్ ఫాదర్ దసరా కానుకగా రాబోతున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలు అయ్యింది. ఎందుకంటే అదే రోజున నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. దసరా సీజన్ కోసం అంటూ ది ఘోస్ట్ హడావుడిగా రెడీ అవుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా అదే రోజు రాబోతున్నట్లుగా ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది.
దసరా పండుగ సినిమాలకు చాలా పెద్ద పండుగ.. పండుగ సెలవులు ఎక్కువ రోజులే ఉంటాయి. కనుక రెండు సినిమాలు విడుదల అయినా పర్వాలేదు అనేది కొందరు అభిప్రాయం. అయితే మరీ ఒకే రోజు రావడం వల్ల నాగార్జున ది ఘోస్ట్ సినిమాకి కాస్త అయినా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కనుక ఒక్కటి లేదా రెండు రోజులు అటు ఇటు అయితే మంచిది అనేది కొందరు అభిప్రాయం.
ఇక చిరంజీవి మరో సినిమా భోళా శంకర్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే అదే నెలలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా ను కూడా విడుదల చేయాలని భావించారు. క్రిష్ ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అవ్వడంతో ఏప్రిల్ లో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తానంటున్నాడు.
దాంతో ఒకటి రెండు వారాల గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి రావచ్చు అంటున్నారు. ఈ పోటీ ఎంత వరకు ఆరోగ్యదాయకం అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంద.
ఇక చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడికి సిద్ధం అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా వాల్తేరు వీరన్న సినిమా కూడా మోస్ట్ వెయిటెడ్ మూవీ అనడంలో సందేహం లేదు. ఆ సినిమా తో మరే హీరోకు చిరు పోటీగా నిలుస్తాడో చూడాలి.