Begin typing your search above and press return to search.

హాట్ షాట్‌: మెగాస్టార్ ద‌ర్శ‌క‌త్వం!

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:23 AM GMT
హాట్ షాట్‌: మెగాస్టార్ ద‌ర్శ‌క‌త్వం!
X
150 చిత్రాల క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి కెప్టెన్సీ పై క‌న్నేశారా? తాను న‌టిస్తున్న సినిమాకి తానే ద‌ర్శ‌కుడిగా మార‌నున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఆ సినిమా ఎప్పుడు సెట్స్‌ కెళుతుంది? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.

హీరోలు ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం అన్న‌ది కొత్తేమీ కాదు. యన్టీఆర్‌ అంత‌టి విశ్వ‌విఖ్యాత న‌టుడు `దాన‌వీర సూర క‌ర్ణ` స‌హా దాదాపు 16చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీతారామ క‌ళ్యాణం - గులేభాకావ‌ళి క‌థ‌ - త‌ల్లా పెళ్లామా? - కుల గౌర‌వం - కోడ‌లు దిద్దిన కాపురం - బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌ - .. ఇలాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కించారు. కేవ‌లం ద‌ర్శ‌క‌త్వం మాత్ర‌మే కాదు... ఆయా సినిమాల‌కు క‌థ‌ - క‌థ‌నం రాయ‌డంలో ఆయ‌న మేధోత‌నం ప‌ని చేసింది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్ - కాస్ట్యూమ్ డిజైన్ - మేక‌ప్‌ నుంచి ప‌లు కీల‌క శాఖ‌ల్లో ఎన్టీఆర్ ఇన్వాల్వ్‌ మెంట్ ఉంది.

అందుకే చాలాకాలంగా న‌ట‌సార్వ‌భౌముల బాట‌లోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న త‌ప‌న‌తో ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఓ సినిమాకి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంత‌కంటే ముందే ఆయన సైరా సెట్స్‌ లో ప్రీప్రాక్టీస్ చేస్తున్నారు. త‌న‌కు ల‌భించిన ఏ చిన్న‌పాటి అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా ఛాన్స్ వ‌స్తే ఏదైనా సీన్‌ లో షాట్స్‌ కి ఆయ‌న కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారట‌. అయితే సైరా బాధ్య‌త‌ల‌న్నీ సురేంద‌ర్‌ రెడ్డివే. అన్న‌య్య ఇన్వాల్వ్‌ మెంట్ ఏం లేదు. సూరి ఓరోజు సెట్స్‌ కి రావ‌డం ఓ అర్థ‌గంట పాటు ఆల‌స్యమైందట‌. ఆ టైమ్‌ ని వృథా చేయ‌డం ఎందుక‌ని భావించిన మెగాస్టార్ ఓ స‌న్నివేశానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించార‌ట‌. అయితే ఇలా చేయ‌డం మెగాస్టార్‌ కి ఇప్పుడే కొత్తేమీ కాదు. ఆయ‌న కెరీర్‌ లో చాలా సంద‌ర్భాల్లో ఇలా చేశారు. ద‌ర్శ‌కుల‌తో ఆయ‌న సాన్నిహిత్యం అంత ఇదిగా ఉంటుంది. కేవ‌లం ఓ స‌న్నివేశానికి మాత్ర‌మేనా.. మెగాస్టార్‌ పూర్తిగా కెప్టెన్ సీట్‌ లో కూచునేదెప్పుడు? అంటే అందుకు కాస్త స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు సురేంద‌ర్ రెడ్డి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇక ఈ సినిమాని ఇండియా బెస్ట్ హిస్టారిక‌ల్ మూవీగా తీర్చిదిద్ద‌డం కోసం ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా స‌న్నివేశాల్ని మ‌లుస్తున్నార‌ట‌. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై రామ్‌ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజైన టీజ‌ర్‌ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 2019 స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.