Begin typing your search above and press return to search.
చిరు కోరిక తీరేనా?!
By: Tupaki Desk | 9 May 2016 4:51 AM GMTచిరంజీవికి ఎవరెస్టు రేంజిలో మాస్ ఇమేజ్ వుంది. అందుకే ఆయన సినిమాలకి దూరమై తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటికీ ప్రేక్షకుల్లో అదే రకమైన క్రేజ్. ఆయనకి తిరుగులేని మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన ఓ చిత్రం గ్యాంగ్ లీడర్. అందులో... చేయి చూడు ఎంత రఫ్‌గా వుందో అంటూ ఆయన చేసిన మేనరిజమ్స్ ఇప్పటికీ గుర్తే. చిరు చేసిన 149 చిత్రాల్లో గ్యాంగ్ లీడర్ కి ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానం వుంటుందంతే. అలాంటి ఓ సినిమా తన తనయుడు రామ్ చరణ్ కెరీర్ లోనూ వుంటే బాగుండేదనేది చిరంజీవి అభిప్రాయమట. ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు.
గ్యాంగ్ లీడర్ విడుదలై సోమవారంతో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ ఆ సినిమాని చరణ్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ సినిమాని చూసుకోవాలనేది తన ఆశగా చెప్పాడు. మరి చరణ్ కి తగ్గట్టుగా గ్యాంగ్ లీడర్ స్క్రిప్టుని తయారు చేసేది ఎవరో? చిరు కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.
రామ్ చరణ్ కి కూడా గ్యాంగ్ లీడర్ అంటే చాలా ఇష్టం. బ్రూస్ లీలో ఇంచుమించుగా గ్యాంగ్ లీడర్ లోని చిరు స్టైల్ నే అనుకరించాడు రామ్ చరణ్. డ్యాన్సుల్లోనూ - ఫైట్లలోనూ చిరుకి ఏమాత్రం తీసిపోడు చెర్రీ. కానీ గ్యాంగ్ లీడర్ లో కుటుంబ అనుబంధాలు - మంచి కామెడీ కూడా వుంటుంది. ఆ విషయాలపై కూడా చెర్రీ దృష్టిపెడితేనే గ్యాంగ్ లీడర్ పండుతుంది. దర్శకులూ... చిరు కోరికని తీర్చండి మరీ!