Begin typing your search above and press return to search.
'రోషన్ నాకు రామ్ చరణ్ లాంటోడు'
By: Tupaki Desk | 17 Sep 2016 4:17 AM GMTఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం పొందాలని సినిమా వాళ్లంతా ఎందుకు కోరుకుంటారో.. చెప్పకనే చెప్పేశారు చిరు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన చిరు.. రోషన్ ను.. హీరోయిన్ శ్రియా శర్మను ఆకాశానికి ఎత్తేశారు చిరంజీవి. ముఖ్యంగా రోషన్ గురించి చెప్పిన తీరు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
'రోషన్... నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన బిడ్డ. ఇంకా చెప్పాలంటే.. నాకు రామ్ చరణ్ ఎలాగో.. మిగిలిన మేనల్లుళ్లు ఎలాగో.. వారిలాగే మరొక బిడ్డ రోషన్. రోషన్ పుట్టిన దగ్గర నుంచి అర్ధమైంది ఏంటంటే ఈ కుర్రాడు బోర్న్ టు బి ఏ హీరో. హీరో మెటీరియల్ అని ముందే తెలుసు. ఈ సినిమా బాగా రోషన్ కు బాగా హెల్ప్ అవుతుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోగా రూపొందడానిక ఈ సినిమా ఉపయోగపడుతుంది' అని చెప్పిన చిరు అంతటితో ఆగలేదు.
'ఈ సినిమా విజయం అంతా హీరో హీరోయిన్ల కళ్లలోనే ఉంది. ఇలాంటి సినిమా ఆడాలి. ప్రేక్షకుల మన్నన ఆదరణ పొందాలి. అప్పుడే ఇలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్స్ మరిన్ని వస్తాయి. ఆల్ ది బెస్ట్' అంటూ నిర్మలా కాన్వెంట్ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.