Begin typing your search above and press return to search.
మెగా-మంచు స్నేహం పై ఇప్పుడే ఎందుకిలా!
By: Tupaki Desk | 2 Feb 2020 4:24 AM GMTమెగాస్టార్ చిరంజీవి-కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య వివాదాలపై నిరంతరం అభిమానుల్లో చర్చ సాగుతుంటుంది. ఆ ఇద్దరి మధ్య టాలీవుడ్ వజ్రోత్సవాల వేళ క్లాషెస్ రావడం ఆ గొడవలో అన్నయ్య తరపున పవన్ కల్యాణ్ సీరియస్ గా మోహన్ బాబుపై కౌంటర్లు వేయడం తెలిసిందే. ఆ క్రమంలోనే.. మెగా వర్సెస్ మంచు అంటూ ప్రచారమైంది. ఆ ఇద్దరూ స్నేహితులు .. క్లోజ్ బడ్డీస్ అయినా ఒకరంటే ఒకరికి పడదని ఎప్పటికప్పుడు టాలీవుడ్ మీడియాలో వాడివేడిగా చర్చ సాగేది. అయితే ఇటీవల మా డైరీ ఆవిష్కరణ వేదికపై ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చూశాక.. గత వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా భావిస్తున్నారు. 2020 `మా` డైరీ ఆవిష్కరణలో భాగంగా మైక్ లో చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఆ వెనుక కూర్చున్న చిరు.. సడెన్ గా కుర్చీలో నుంచి లేచి మోహన్ బాబును వెనకగా ఆలింగనం చేసుకుని...బుగ్గపై ఓ స్వీట్ కిస్ ఇచ్చేసిన ఫన్నీ మూవ్ మెంట్ ని ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.
వివాదాలు ఉన్నా అవి కొంతకాలమేనని... నా ఇంటికి చిరంజీవి రాకుండా ఉంటారా? ఆయన ఇంటికి నేను వెళ్లకుండా ఉండిపోతానా? అని ఆ సందర్భంలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న వివాదం పూర్తిగా సమసిపోయిందనే అర్థమైంది. తాజాగా మెహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఆ ఇద్దరి స్నేహం పైనా ఆసక్తికర సంగతులు తెలిపారు.
కొత్త దశాబ్ధం.. కొత్త సంవత్సరం లో మొదటి నెల పూర్తవ్వడంతో చిరు-మోహన్ బాబుల మధ్య ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని..వాళ్లిద్దరి ఆలింగనం చేసుకున్న ఫోటో చూస్తుంటో ఎంతో ముచ్చటేస్తోందని వ్యాఖ్యానించారు. సమకాలీన నటులుగా.. ఆ ఇద్దరూ స్నేహితులు అని లక్ష్మీ ప్రసన్న మరోసారి వెల్లడించారు. వారంతంలో వాళ్లు మా ఇంటికి.. మేము వాళ్ల ఇంటికి వెళ్లే వాళ్లమని.. చిరంజీవి- మోహన్ బాబు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారని లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అలాగే షూటింగ్ లు ఎక్కువగా ఊటీలో జరుగుతున్నప్పుడు రెండు కుటుంబాలు కలిసి తరుచూ అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసే వాళ్లమని వెల్లడించారు. ఒకవేళ నిజంగా గొడవలు ఉంటే ఇద్దరు కలిసి అన్ని సినిమాలు చేసి ఉండేవారు కాదని అనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గొడవలు మొదలైంది ఆ ఇద్దరూ సీనియర్లు అయిన తర్వాతనే సుమీ.. అంతకుముందు స్నేహితులే లక్ష్మీ చెప్పినట్టు. ఇలాంటి పొరపొచ్చాలు ఈగోలు అందరికీ ఉండేవే. అయితే ఆ ఇద్దరూ కలిసిపోయి ప్రస్తుతం టాలీవుడ్ ఆర్టిస్టుల సంఘానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తప్పుల్ని సరిచేసే క్రమశిక్షణా సంఘంలో బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు. అదీ సంగతి.