Begin typing your search above and press return to search.
వర్మ ట్వీట్లపై చిరు కూతురు రియాక్షన్
By: Tupaki Desk | 3 Feb 2017 5:36 AM GMTగతంలో సెన్సేషనల్ ఫిలిమ్స్ తీసి సంచలన దర్శకుడిగా పిలిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ మధ్య సెన్సేషన్స్ అన్నీ ట్వీట్స్ వరకే పరిమితం చేస్తున్నాడు. ముఖ్యంగా మెగా హీరోలపై వర్మ ట్వీట్స్.. ఏదో ఒక వివాదం సృష్టించేలానే ఉంటాయి. వీటిపై గతంలో మెగా ఫ్యామిలీ నుంచి స్పందన ఉండేది కాదు. కానీ ఇప్పుడు వరుసగా వర్మకు ఆ కుటుంబం నుంచి పంచ్ లు పడుతూనే ఉన్నాయి.
ఖైదీ నంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదికగా మొదట నాగేంద్రబాబు.. వర్మను తిట్టిపోశాడు. ఆ తర్వాత ఖైదీ కోసం పబ్లిసిటీలో భాగంగా చిరంజీవి కూడా స్పందించారు. రీసెంట్ గా పవన్ ని మీడియా ఈ విషయంపై ప్రశ్నిస్తే.. పవర్ స్టార్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు చిరంజీవి కూతురు సుశ్మిత కూడా వర్మ ట్వీట్స్ పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సుశ్మిత.. వర్మ ట్వీట్స్ చూసి నవ్వుకుంటూ ఉంటామని చెప్పింది.
'లంచ్ బ్రేక్ లో మాట్లాడుకోవడానికి తప్ప వర్మ కామెంట్స్ ఎందుకూ పనికి రావు. ఖాళీ సమయంలో అవి చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఒకరి మాటలను మనం నియంత్రంచలేం కదా' అన్న సుశ్మిత.. 'ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉన్నా.. పూర్తిగా నెగిటివ్ గా మాట్లాడేవారిని సోషల్ మీడియానుంచి బ్లాక్ చేయాలి' అని చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/