Begin typing your search above and press return to search.
దసరా టీజర్లు.. ఆ ఇద్దరి గురించి మాట్లాడరేం?
By: Tupaki Desk | 13 Oct 2016 5:30 PM GMTదసరాకు వచ్చిన రెండు పెద్ద సినిమాల టీజర్లకూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఉదయం వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టీజర్.. సాయంత్రం వచ్చిన ‘ధృవ’ టీజర్.. రెండూ కూడా సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపాయి. ఆ హీరోల అభిమానుల్నే కాక సామాన్య ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాయి. ఐతే ఈ టీజర్ల విషయంలో హీరోల గురించి.. దర్శకుల గురించి.. బాగానే చర్చించుకున్నారు కానీ.. వీటికి అదిరిపోయే రేంజిలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఇద్దరు సంగీత దర్శకుల గురించి పెద్దగా చర్చ జరగలేదు. చాలామందికి ఈ సినిమాలకు సంగీతం అందిస్తున్నది కూడా ఎవరో తెలియదు. ఎందుకంటే వాళ్లిద్దరూ అంత ఫేమస్ కాదు. తెలుగు ప్రేక్షకులకు వారి గురించి తెలిసింది తక్కువ.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ముందు అనుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. తర్వాత అతడి స్థానాన్ని ‘కంచె’ ఫేమ్ చిరంతన్ భట్ రీప్లేస్ చేశాడు. అతడీ ప్రాజెక్టులోకి వచ్చే ఎంతో కాలం అయిపోలేదు. అయినా టీజర్లో తన ముద్ర చూపించాడు. సినిమా స్థాయికి తగ్గట్లే తిరుగులేని బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాడు. సినిమా మీద అంచనాలు పెంచాడు. ఇక ‘ధృవ’కు పని చేస్తోంది మన ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని సంగీత దర్శకుడు. అతడి పేరు హిప్ హాప్ తమిజ. తమిళంలో అతను మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ‘తనీ ఒరువన్’కు అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద బలంగా నిలిచింది. అందుకే తెలుగు వెర్షన్ కు కూడా అతణ్నే తీసుకున్నాడు సురేందర్ రెడ్డి. టీజర్లో తనదైన ముద్ర చూపించాడు హిప్ హాప్ తమిజ. టీజర్ ఎంత స్టైలిష్ గా.. రేసీగా ఉందో అతడి మ్యూజిక్ కూడా అలాగే కుదిరింది. మొత్తానికి ఈ టాలెంటెడ్ మ్యుజీషియన్స్ ఇద్దరూ ఆ సినిమాలకు పెద్ద బలంగా బలంగా నిలవబోతున్నారన్న సంగతి టీజర్లతోనే రుజువైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/