Begin typing your search above and press return to search.
దేవిశ్రీని తప్పించారనే విషయం తెలీదు-చిరంతన్
By: Tupaki Desk | 1 Jan 2017 6:43 AM GMTగౌతమిపుత్ర శాతకర్ణి టీం ప్రమోషన్ షురూ చేసింది. ముందుగా సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఇంటర్వ్యూతో మూవీ ప్రమోషన్ ను ప్రారంభించింది చిత్ర బృందం. క్రిష్ డైరెక్షన్లో చిరంతన్ భట్ పనిచేయడం ఇది మూడో సారి. ముందుగా గబ్బర్ ఈజ్ బ్యాక్.. కంచె చిత్రాలకు పనిచేశాడు. ఇప్పుడు బాలయ్య వందో చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ఈ సందర్భంగా చిరంతన్ భట్ మీడియాతో ముచ్చటించారు. దేవిశ్రీ ప్రసాద్ ను ఈ చిత్రం నుంచి తప్పించారనే విషయం నాకు తెలీదు. నేను నాసిక్ లో వుండగా దర్శకుడు క్రిష్ ఫోన్ చేసి.. బాలయ్య వందో చిత్రానికి సంగీతం అందించాలని కోరారు. దాంతో నేను సరే అన్నా. ఇక ఏ వివరాలు నేను అడగలేదని అన్నారు.
డైరెక్టర్ క్రిష్ షూటింగ్ లో బిజీగా వుండటం వల్ల మొదట కలవలేకపోయా. ఫోన్లో సిచ్యుయేషన్ వివరించడంతో... దానికి తగ్గట్టుగా ట్యూన్స్ ను కంపోజ్ చేశా. ఇది హిస్టారికల్ చిత్రం కాబట్టి... పాత ఇన్ స్ట్రూమెంట్స్ నే ఉపయోగించా. ఎందుకంటే... ఆనాటి ఫీల్ రావడానికి. ఒక్కటి మాత్రం నిజం.. శాతకర్ణి సాధారణ చిత్రం అయితే కాదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు. ఇదో విజువల్ ఫీస్ట్ అని చెప్పగలను. రచయిత బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులకు హాల్లో విజిల్ వేయకుండా మాత్రం ఎవ్వరూ వుండలేరు. అంతటి పవర్ ఫుల్ డైలాగులు ఇందులో వున్నాయని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ... బాలకృష్ణగారికి ఇది వందో చిత్రమైనా నేను ఎలాంటి ఈక్వేషన్స్, ప్రెషర్స్ పెట్టుకోలేదు. బాలయ్యగారి ఫ్యాన్స్, ఆయన వందవ సినిమా ప్రెషర్ అంతా డైరెక్టర్ క్రిష్‌కు బాగా తెలుసు. కాబట్టి ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకోవాలో తనకే బాగా తెలుసన్నది నా నమ్మకం. అందుకే క్రిష్ నా మ్యూజిక్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తే చాలు.. అనుకున్నా. దాన్నే మైండ్‌లో పెట్టుకుని పనిచేశా అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/