Begin typing your search above and press return to search.
‘శాతకర్ణి’ చూస్తే కళ్లు చెదిరిపోయాయి-చిరంతన్
By: Tupaki Desk | 4 Jan 2017 7:42 AM GMT‘కంచె’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్. సినిమా స్థాయికి తగ్గట్లుగా అద్భుతమైన సంగీతం అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చిరంతన్. ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రెస్టీజియస్ మూవీకి కూడా అతనే సంగీతాన్నందించాడు. ఈ ఆడియో కూడా మంచి స్పందన రాబట్టుకుంది. సినిమాలో భట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంతన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేయడం ప్రత్యేకమైని అనుభవం అన్నాడు. రీరికార్డింగ్ కోసం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చూసినపుడు కళ్లు చెదిరపోయానని చెప్పాడు.
‘‘కంచె సినిమాకు సంగీతాన్నందించడం ప్రత్యేకమైన అనుభవం. అది చాలా భిన్నమైన సినిమా. దాంతో పోలిస్తే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పూర్తి భిన్నమైంది. ఈ సినిమాకు సంగీతాన్నందించడం సవాలుగా నిలిచింది. ఆ కథకు తగ్గట్లు.. ఆ కాలానికి తగ్గట్లు సంగీతం అందించాలి. అదే సమయంలో పాటలు ఇప్పటికే యూత్ కు కనెక్టవ్వాలి. పైగా చాలా తక్కువ సమయంలో పాటలు పూర్తి చేయాల్సి వచ్చింది. ఇది నాకు సవాలుగా నిలిచింది. ఆడియోను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీతారామశాస్త్రి గారి లాంటి దిగ్గజంతో పని చేయడం నా అదృష్టం. ఆడియోకు సంబంధించి సగం క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. ఇక రీ రికార్డింగ్ చేయడానికి సినిమా చూసినపుడు ఆశ్చర్యపోయాను. క్రిష్ అంత అద్భుతంగా సినిమా తీశాడు. వార్ సీక్వెన్స్ లో విజువల్ గ్రాండియర్ కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఐతే వాటన్నింటికంటే కూడా ఇందులోని కంటెంట్.. ఎమోషన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వాటితో ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు’’ అని చిరంతన్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/