Begin typing your search above and press return to search.

మ‌రోసారి ప‌రిశ్ర‌మ పెద్ద తానే అనిపించిన మెగాస్టార్!

By:  Tupaki Desk   |   8 March 2022 4:02 AM GMT
మ‌రోసారి ప‌రిశ్ర‌మ పెద్ద తానే అనిపించిన మెగాస్టార్!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల అంశానికి తెర దించుతూ నిన్న‌టి సాయంత్రం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త జీవోని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజా జీవోతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ఎంతో ఊర‌ట క‌ల‌గ‌నుంది. దీనిపై ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏడాది కాలంగా సాగిన తీవ్ర‌మైన డిబేట్.. పొలిటిక‌ల్ ర‌గ‌డ‌ అనంత‌రం ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం అన్నివ‌ర్గాల‌కు ఆమోద‌యోగ్యంగానే క‌నిపిస్తోంద‌నేది టాక్. దీనిపై హీరోలు హ‌ర్షం వ్య‌క్త‌మ చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించారు. ఏపీలో సినిమా టికెట‍్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులకు మెగాస్టార్‌ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తెలుగు సినీ పరిశ‍్రమ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

``తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా అటు థియేటర్ల మనుగడను కాపాడుతూ ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని.. సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్‌ గారికి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు`` అని అన్నారు. ఇక చిన్న సినిమాకు ఐదో షో కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం.

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని- అధికారులు- కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్ర‌భుత్వానికి ప‌రిశ్ర‌మ త‌ర‌పున తొలి నుంచి వ‌కాల్తా పుచ్చుకున్న‌ది మెగాస్టార్ చిరంజీవి. అందుకే జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించ‌గానే ఆయ‌నే తొలిగా స్పందించి ప‌రిశ్ర‌మ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌రోసారి ప‌రిశ్ర‌మ పెద్ద తానే అనిపించారు మెగాస్టార్.

మ‌రోవైపు.. మెగాస్టార్ చిరంజీవి- చ‌ర‌ణ్ కాంబినేష‌న్ న‌టించిన ఆచార్య స‌హా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్- తార‌క్ కాంబో న‌టించిన ఆర్.ఆర్.ఆర్ కూడా ఏపీలో టిక్కెట్టుతో బెట‌ర్ రిజ‌ల్ట్ ని అందుకోనున్నాయ‌ని అంచ‌నా. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ కి టికెట్ పెంపు పెద్ద ప్ల‌స్ కానుంది.