Begin typing your search above and press return to search.

43 ఏళ్ల ముందు 43 ఏళ్ల త‌ర్వాత చిరు!

By:  Tupaki Desk   |   23 Sep 2021 7:31 AM GMT
43 ఏళ్ల ముందు 43 ఏళ్ల త‌ర్వాత చిరు!
X
24 ఏజ్ కి మెగాస్టార్ చిరంజీవి సినీన‌టుడు అయ్యారు. 22 ఆగ‌స్టు 1955 ఆయ‌న జ‌న‌నం. 1979లో తొలి చిత్రం ప్రాణం ఖ‌రీదు విడుద‌లైంది. అనంత‌రం వెండి తెర‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎంతో సుదీర్థ‌మైన‌ది. తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసి..త‌న‌కంటూ ఓ పేజీని రాసిపెట్టుకున్నారు. 43 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో 150 కి పైగా సినిమాల్లో న‌టించారు. ఇప్ప‌టికే అదే ఎన‌ర్జీతో మెగాస్టార్ వెండి తెర‌ని ఏల్తుతున్నారు. స‌రిగ్గా 22 సెప్టెంబ‌ర్ 1978 లో చిరంజీవి న‌టించిన తొలి సినిమా `ప్రాణం ఖ‌రీదు` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. నేటికి నిన్న‌టికి ఆ సినిమా రిలీజ్ అయి స‌రిగ్గా 43 ఏళ్లు పూర్త‌యింది. వాస్త‌వానికి చిరంజీవి హీరోగా మొద‌ట ప్రారంభ‌మైన సినిమా `పునాది రాళ్లు`...కానీ ఆ సినిమా ప్రారంభ‌మైతే జ‌రిగింది. చిరంజీవి కెమెరా ముందుకెళ్ల‌డం కూడా అదే తొలిసారి.

కానీ ఆ సినిమా ముందుగా ప్రారంభ‌మైనా తొలి చిత్రంగా రిలీజ్ అవ్వ‌లేదు. ఇంత‌లో `ప్రాణం ఖ‌రీదు` షూటింగ్ పూర్త‌వ్వ‌డం రిలీజ్ అవ్వ‌డం జ‌రిగింది. నిన్న‌టితో ఈ చిత్రానికి 43 పూర్త‌యిన సంద‌ర్భంగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ట్విట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప్ర‌త్యేకంగా ఓ పోస్ట్ పెట్టారు. చిరంజీవి `ప్రాణంఖ‌రీదు` చిత్రంలో ఓ స్టిల్..అలాగే ప్ర‌స్తుత న‌టిస్తోన్న `ఆచార్య` సినిమాలో చిరంజీవి లుక్ ని ప‌క్క‌ప‌క్క‌నే అతికించి ట్విట‌ర్ ద్వారా విషెస్ తెలిపారు. ``43 ఏళ్ల ముందు 43 ఏళ్ల త‌ర్వాత మై అప్ప స్టిల్ కంటున్యూ..`` అంటూ చ‌ర‌ణ్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ అభిమానులు మెగా అభిమానుల్లో జోష్ ని నింపారు.

మెగా అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ కి శుభాకాక్ష‌లు తెలియ‌జేసారు. వెండి తెర‌పై మెగాస్టార్ ఎప్ప‌టికీ మెరుస్తూనే ఉండాల‌ని కాంక్షించారు. మ‌రో 43 ఏళ్ల పాటు మెగాస్టార్ త‌మ‌ని న‌టుడిగా అల‌రించాల‌ని కోరుకున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌`లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో చిరంజీవి `గాడ్ ఫాద‌ర్` షూటింగ్ లో బిజీ అయ్యారు. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

60 ప్ల‌స్ లోనూ అదే దూకుడు

మెగాస్టార్ చిరంజీవి 60 ప్ల‌స్ ఏజ్ లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మేన‌ని ఆయ‌న నిరూపిస్తూ యువ‌హీరోల‌కే స‌వాల్ విసురుతున్నారు. ఆచార్యను రిలీజ్ కి రెడీ చేస్తున్న చిరు.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫ‌ర్ రీమేక్ `గాడ్ ఫాద‌ర్` లో న‌టిస్తున్నారు. దీంతో పాటు మెగాస్టార్ మ‌రో రెండు చిత్రాల్లో న‌టిస్తారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న వేదాళం రీమేక్ టైటిల్ గా `భోళా శంక‌ర్`ని ప్ర‌క‌టించారు. భోళా శంక‌ర్ టైటిల్ కి త‌గ్గ‌ట్టే మెగాస్టార్ నుంచి గొప్ప వినోదాన్ని అందించ‌నున్నారు.అలాగే మెహ‌ర్ కంటే ముందే బాబీతో సినిమా చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉంటుందిట‌. కానీ ద‌ర్శ‌కుడు బాబి తెర‌కెక్కించే సినిమాకి టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. మెగా బాస్ ని పూర్తి మాస్ రోల్ లో చూపించేందుకు బాబి సిద్ధ‌మ‌వుతున్నారు.

చిరు బ‌ర్త్ డే రోజున‌ పోస్ట‌ర్ ని లాంచ్ చేయ‌గా చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. దీనికి వాల్తేరు వీర‌న్న లేదా వాల్తేరు శీను అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. వైజాగ్ లోని మ‌త్స్య‌కారుల నేప‌థ్యంలో మాస్ స్టోరీని బాబి ఎంపిక చేసుకున్నార‌ని ఊహాగానాలు సాగిస్తున్నారు. వాల్తేర్ కి చెందిన వీర‌న్న క‌థ‌ను బాబి రాసారు. అయితే ఇప్పుడు వీర‌న్న టైటిల్ మారుతుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. వాల్తేర్ వీర‌న్న కాస్తా వాల్తేర్ శీనుగా మార్చార‌ని క‌థ‌నొలొచ్చాయి. గాడ్ ఫాదర్ చిత్రీకరణ పూర్తి కాగానే బాబీతో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తుంది. వ‌రుస‌గా మూడు సినిమాలు పూర్త‌య్యాక మారుతికి ఛాన్సుంటుంద‌ని భావిస్తున్నారు.