Begin typing your search above and press return to search.

'లూసిఫర్'ని పక్కన పెట్టేశారా...?

By:  Tupaki Desk   |   31 July 2020 2:30 AM GMT
లూసిఫర్ని పక్కన పెట్టేశారా...?
X
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఇక ఈ రీమేక్ కు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడని.. ఇప్పటికే సుజీత్ మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'లూసిఫర్' స్క్రిప్ట్ లో సుజీత్ చేసిన ఛేంజెస్ మెగాస్టార్ కి నచ్చలేదని.. అందుకే ఆయన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించే ఆలోచన చేస్తున్నారని.. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ కి ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తున్నారని రూమర్స్ వచ్చాయి. అంతేకాకుండా 'లూసిఫర్' తెలుగు డబ్బింగ్ వర్షన్ ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండటంతో ఈ సినిమా రీమేక్ ఆలోచన పక్కన పెట్టారని.. ఈ రీమేక్ పట్టాలెక్కే అవకాశం లేదనే టాక్ వచ్చింది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా సుజిత్ చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని మలయాళ వర్షన్ కి చాలా ఛేంజెస్ చేశారట. అయితే మెగాస్టార్ ఈ స్క్రిప్ట్ కి ఓకే చెప్పాలా లేదా ఈ ప్రాజెక్ట్ మరొక డైరెక్టర్ చేతిలో పెట్టాలా అనే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చిరు ఫోకస్ మొత్తం 'ఆచార్య' పై పెట్టాడట. ఇప్పటికే నాలుగున్నర నెలల సమయం వృధాగా పోవడంతో ముందుగా 'ఆచార్య'ని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. మరోవైపు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్న రామ్ చరణ్ కూడా ప్రస్తుతం 'ఆచార్య' మరియు 'ఆర్.ఆర్.ఆర్'లపై ద్రుష్టి పెట్టాలని నిరణయించుకున్నారట. రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత 'లూసిఫర్' రీమేక్ గురించి ఆలోచించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.