Begin typing your search above and press return to search.
రాములమ్మ పొలిటికల్ థియరీ ముందు చిరు తేలిపోయాడే
By: Tupaki Desk | 6 Jan 2020 5:38 AM GMTచిరు.. విజయశాంతి కాంబినేషన్ సినిమాల్లో సూపర్ హిట్. ఇద్దరూ పోటాపోటీగా నటించేవారు. ఇద్దరూ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకు పండుగే. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత మహేశ్ తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీ ఫంక్షన్ పుణ్యమా అని వీరిద్దరూ కలిశారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లటం.. తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవిని ఉద్దేశించి ఆమె కొన్ని విమర్శలు చేయటం తెలిసిందే.
విజయశాంతి గురించి స్టేజ్ మీద మాట్లాడే సమయంలో ఎమోషన్ చిరు ఎమోషన్ అయినట్లుగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో తామిద్దరం సుదీర్ఘంగా కలిసి నటించిన విషయాలు గుర్తుకు వచ్చాయో కానీ.. చిరు మాటలు చిన్నపిల్లాడిని తలపిస్తే.. అందుకు భిన్నంగా రాములమ్మ మాత్రం ఫుల్లీ లోడెడ్ అన్నట్లుగా ఎక్కడా బ్యాలెన్స్ మిస్ కాకుండా రియాక్ట్ అయిన తీరు ఆసక్తికరంగా మారింది.
సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఒక పబ్లిక్ ఫంక్షన్ లో వీరిద్దరూ కలిసింది ఇప్పుడే. ఈ సందర్భంగా విజయశాంతిని ఉద్దేశించి చిరు చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు రాజకీయాలు చిరుకు ఏ మాత్రం సూట్ కావన్న విషయం మరోసారి రుజువైంది. కేంద్రమంత్రి పదవిని చేపట్టిన ఆయన.. చిన్న పిల్లాడిలా మాట్లాడటం విస్మయానికి గురి చేసింది.
రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరన్న చిన్న విషయాన్ని చిరంజీవి మిస్ అయితే.. ఆ విషయంలో తానెంత క్లారిటీతో ఉన్నానన్న విషయాన్ని విజయశాంతి తన మాటలతో చెప్పేశారు. రాజకీయాలు శత్రువులను పెంచుతుంది. సినిమా పరిశ్రమ స్నేహితుల్ని.. స్నేహాన్ని పెంచుతుందన్నారు చిరు. కొన్ని పరిస్థితుల్లో విజయశాంతి తనను విమర్శించినా తాను మాత్రం తిరిగి విమర్శించాలని అనిపించలేదన్నారు. అందుకే ఆమెను ఒక్క మాట కూడా అనలేదన్నారు. విజయశాంతిని మాట అనటానికి తనకు మనసు రాదని చిరు అంటే.. మధ్యలో కల్పించుకున్న విజయశాంతి.. నా వెనుకాల అనలేదు కదా? అని సరదా వ్యాఖ్య చేశారు. అందుకు స్పందించిన చిరు.. ముందే అనలేదు.. వెనకాల అంటానా? అని బదులిచ్చారు.
ఇక్కడితో విషయం ఆగలేదు. కాస్త ముందుకు వెళ్లింది. చిరు వ్యాఖ్యలను తనదైన శైలిలో రియాక్ట్ అయిన విజయశాంతి.. చిరంజీవి మీద ఎప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. అభిమానం.. గౌరవం ఉండబట్టే ఇరవై సినిమాలు చేశామని.. సినిమాలు.. రాజకీయాలు వేర్వేరన్నారు. ప్రజల కోసం పోరాటం చేశాం. కానీ కొన్ని సందర్భాల్లో విమర్శలు తప్పవన్నారు. రాజకీయాల్లోకి వెళితే ఉద్యమన్నది డ్యూటీ అని.. స్నేహం అన్నది వేరన్నారు. దానికి తాను న్యాయం చేశానంటూ వాతావరణం వేడెక్కుతుందన్న విషయాన్ని గుర్తించి.. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి చివర్లో కూల్ చేసేలా.. ఏది ఏమైనా మా హీరో చిరంజీవినే అనేశారు.
ఇదంతా చూసినప్పుడు రాజకీయాల్లో ఉండేవారిలో ఉండాల్సిన మెచ్యురిటీ విజయశాంతిలో మస్తుగా ఉందన్న విషయాన్ని తన మాటలతో చెప్పేయగా.. ఆ విషయంలో చిరు మాత్రం వెనుకబడే ఉన్నారన్నది వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ తేల్చేసిందని చెప్పక తప్పదు.