Begin typing your search above and press return to search.

మా ఇంటి కోడ‌లు అంటూ చిరు ఎమోష‌నల్

By:  Tupaki Desk   |   21 July 2022 4:17 AM GMT
మా ఇంటి కోడ‌లు అంటూ చిరు ఎమోష‌నల్
X
కుటుంబ‌మంతా ఆద‌ర్శంతో ఆనందంగా జీవించ‌డానికి స‌త్సాంప్ర‌దాయం కావాలి. అలాంటి సాంప్ర‌దాయం ఎప్పుడూ మెగా కుటుంబంలో క‌నిపిస్తుంది. పండుగ‌లు ప‌బ్బాల వేళ ఆ కుటుంబంలోని వారంతా ఓ చోట చేరి ఆనందంగా గడుపుతారు. ఇక భ‌ర్త -అత్త మామ‌ల‌తో ఉపాస‌న కొణిదెల ఎంతో ఆన్యోన్యంగా మెల‌గుతారు. రామ్ చరణ్ -ఉపాసన కొణిదెల టాలీవుడ్ లోని బెస్ట్ క‌పుల్స్ లో ఒకరు. తరచుగా ఈ జంట అన్యోన్య‌త‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలో అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల ద్వారా చేరుతూనే ఉన్నాయి.

ఇటీవ‌లే ప‌దో వివాహ‌ వార్షికోత్స‌వం వేళ అరుదైన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న జంట‌కు అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. 20 జూలై ఉపాసన బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న‌కు రామ్ చ‌ర‌ణ్.. చిరంజీవి ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా త‌న‌కు ఒక స్వీటెస్ట్ సందేశాన్ని ఇన్ స్టాలో షేర్ చేసారు చ‌ర‌ణ్‌. ఉపాస‌న‌తో క‌లిసి ఉన్న‌ ఒక అందమైన ఫోటోని షేర్ చేసి.."నా ప్రియమైన ఉపాసన కామినేని కొనిదెలకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని రాశారు.

ఈ ఫోటోలో మొత్తం కుటుంబం క‌నిపించింది. ఉపాస‌న మామ గారు చిరంజీవి- అత్త‌మ్మ‌ సురేఖ కూడా ఈ ఫ్రేమ్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉపాసనకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నా ఇంటి కోడ‌లు అంటూ ఆయ‌న ఎంతో ఎమోష‌న‌ల్ గా విషెస్ తెలిపారు. నిజానికి చెర్రీతో పాటు కుటుంబ స‌భ్యులు స్పందించిన తీరు అద్భుత‌మైన కానుక అని చెప్పాలి.

రామ్ చరణ్ తదుపరి చిత్రం RC 15 అత్యంత భారీ కాన్వాస్ తో తెర‌కెక్కుతోంది. శంకర్ షణ్ముఖం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందంలో తిర్రు -ఆర్. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ లుగా ఉన్నారు. షమీర్ మహమ్మద్ ఎడిటర్ గా ప‌ని చేస్తున్నారు. ఎస్.ఎస్.

థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌.సి 15 షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ 50 శాతం పైగా షూటింగ్ పూర్త‌యింద‌ని టాక్ ఉంది. షూటింగ్ బిజీ వ‌ల్ల‌నే చ‌ర‌ణ్ ఈసారి ఉపాస‌న బ‌ర్త్ డే కి విదేశీ వెకేష‌న్ ని ప్లాన్ చేయ‌లేక‌పోయారని స‌మాచారం.