Begin typing your search above and press return to search.

ఫైర్ బాల్ అంటూ త‌మ్ముడికి చిరు ఎమోష‌నల్ విషెస్

By:  Tupaki Desk   |   2 Sep 2021 8:41 AM GMT
ఫైర్ బాల్ అంటూ త‌మ్ముడికి చిరు ఎమోష‌నల్ విషెస్
X
మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్ గురించి ఇప్పుడే చెప్పాల్సిందేమీ లేదు. అన్న‌య్య చిరంజీవి అంటే ప‌వన్ ఎంతో ఎమోష‌న‌ల్ ఎటాచ్ మెంట్ తో ఉంటారు. త‌మ్ముడు ప‌వ‌న్ అంటే అంతే ప్రేమాభిమానాలు వాత్స‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు చిరు. ఇటీవ‌లే త‌న సోద‌రుడితో క‌లిసి హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో చిరు లంచ్ చేశారు. ఆ త‌ర్వాత మెగాస్టార్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో ప‌వ‌న్ చాలా సేపు చిరు ఇంట్లోనే ఉండి స‌ర‌దాగా స్పెండ్ చేశారు. ఆ స‌మ‌యంలో ఒక‌రినొక‌రు ఎంతో ఆప్యాయంగా క‌లిసి ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తన ప్రియమైన సోదరుడు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరు ట్వీట్ చేస్తూ పవన్ ఒక ఫైర్ బాల్.. అతను ఎల్లప్పుడూ సమాజానికి ఏదైనా మంచి చేయాలని.. బాల్యం నుండి తనకు సన్నిహితులుగా ఉన్న వారికి సహాయం చేయాలని కోరుకుంటాడు. నా తోబుట్టువు పుట్టినరోజున అన్ని లక్ష్యాలను సాధించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను`` అని విషెస్ తెలిపారు.

ఐక‌న్ స్టార్ అల్లు అర్జున్.. స‌హా సాయి తేజ్.. వ‌రుణ్ తేజ్.. వైష్ణ‌వ్ తేజ్ త‌దిత‌రులు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి విషెస్ తెలియ‌జేస్తూ కాస్త ఎమోష‌న‌ల్ గానే స్పందించారు. బ‌న్ని నేటి ఉద‌య‌మే చాలా ముందుగా ప‌వ‌న్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ``నా గురువు.. నా బలం నా ప‌వ‌న్ క‌ల్యాణ్ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిస్వార్థమైన ఆత్మ మీరు.. ఎల్లప్పుడూ ప్రేమను కోరుకుంటున్నాను`` అని సాయి ధరమ్ తేజ్ విషెస్ తెల‌ప‌గా.. ``పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్! మీకు ప్రతిదానిలోనూ మంచి జరగాలని కోరుకుంటూ .. అప‌రిమిత ప్రేమ‌ గౌరవం మీపై`` అని వ‌రుణ్ విషెస్ తెలియ‌జేసారు.

కుటుంబ స‌భ్యుల‌తో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. ర‌వితేజ.. ఎన్టీఆర్ స‌హా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖ హీరోలంతా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి విషెస్ తెలియ‌జేసారు. సినీరంగంతో పాటు రాజ‌కీయ రంగ ప్ర‌ముఖుల నుంచి శుబాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయిక‌లంతా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌లు తెలిపారు.