Begin typing your search above and press return to search.

మెగాఫ్యామిలీ అభినందనీయం..

By:  Tupaki Desk   |   30 March 2020 6:15 AM GMT
మెగాఫ్యామిలీ అభినందనీయం..
X
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కులా కన్పిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో సమస్యలు పరిష్కరించి ముందుకు నడిపిన విషయం తెలిసిందే. దాసరి తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినీ సమస్యల పై స్పందించడం మొదలుపెట్టారు. రాజకీయాల తర్వాత పూర్తిగా కళామతల్లికే తన సేవలు అందించాలని చిరంజీవి ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ఏ చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా సహకరిస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలోనే గాక 'మా' అసోసియేషన్ లో సమస్యలు వచ్చినా చిరంజీవి దగ్గరుండి పరిష్కరిస్తున్నారు.

ఇవేగాక మెగాస్టార్ ఫ్యామిలీ కరోనా లాంటి సమస్యలకు భారీ విరాళాలను అందించడంలో కూడా ముందే ఉంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ 2కోట్ల భారీ విరాళం కేంద్రానికి ప్రకటించడంతో అందరిలో స్ఫూర్తి రగిలింది. ఆ వెంటనే మెగాస్టార్ కోటి రూపాయలు సినీ వర్కర్స్ కి డొనేట్ చేసాడు. ఇక రాంచరణ్ 70లక్షలు ప్రభుత్వానికి అందించి, 30లక్షలను సినీ వర్కర్స్ కోసం ప్రకటించాడు. అనంతరం అల్లు అర్జున్ 1రూపాయలు తెలుగు రాష్ట్రాలకు అందించి 25లక్షలు కేరళ రాష్ట్రానికి అందించాడు. అంతేగాక వరుణ్ తేజ్ 20లక్షలు, సాయిధరమ్ తేజ్ 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి వారి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇలా దాదాపు మెగా ఫ్యామిలీనే 5కోట్ల వరకు భారీ విరాళాలు అందించింది. మరి విరాళాలు ఇవ్వడమే కాకుండా కరోనా పై అవగాహన కల్పిస్తున్న మెగా హీరోల కృషికి అభినందించాల్సిందే. ఇలా మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ముందుండి నడిపే సత్తా ఉందని తెలుస్తుంది..