Begin typing your search above and press return to search.

ఆహా ఓటీటీకి 'చిరు' సాయం..?

By:  Tupaki Desk   |   1 Sep 2021 7:34 AM GMT
ఆహా ఓటీటీకి చిరు సాయం..?
X
100% తెలుగు కంటెంట్ తో డిజిటల్ వరల్డ్ లోకి 'ఆహా' ఓటీటీ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. సూపర్ హిట్ సినిమాలు - వెబ్ సిరీస్ లతో పాటుగా ఇతర భాషల చిత్రాలను అనువదించి తెలుగు ఆడియన్స్ కి అందిస్తోంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ని.. మిగతా ఓటీటీలకు ధీటుగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా తనవంతు సపోర్ట్ ఇస్తున్నాడు. అయితే అన్నీ తానై ఆహా ను సక్సెస్ ఫుల్ గా న‌డిస్తున్న అల్లు అరవింద్.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం మెగాస్టార్ చిరంజీవి సహాయం తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆహా కోసం చిరంజీవితో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయని.. ఆయ‌న‌కు కాన్సెప్ట్ న‌చ్చితే చాలు అని అల్లు అరవింద్ ఆ మధ్య మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అక్కినేని కోడలు సమంత హోస్ట్ చేసిన 'సామ్ జామ్' టాక్ షో కు బిగ్ బాస్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ తో ఓ స్పెషల్ షో లేదా ఓ వెబ్ సిరీస్ చేయించాలని మెగా ప్రొడ్యూసర్ ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు ఇటీవల అల్లు అరవింద్ మరోసారి చిరంజీవిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే చిరంజీవి కూడా విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తే ఆహా కోసం తనవంతు సహకారం అందించడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే ఏదైనా టాక్ షో - గేమ్ షో హోస్ట్ చేయాలా లేదా వెబ్ సిరీస్ - ఒరిజినల్ మూవీ చేయాలా అనే విషయంలో ఆలోచన చేస్తున్నారట. ఇప్పుడు ఆహా కోసం వర్క్ చేస్తున్న వంశీ పైడిపల్లి - నందిని రెడ్డి వంటి పలువురు క్రియేటివ్ టీమ్ మెగాస్టార్ ని మెప్పించడానికి ఆసక్తికరమైన కాన్సెప్ట్స్ సిద్ధం చేస్తున్నారని టాక్. మరి చిరు సైడ్ నుంచి వీటకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

చిరంజీవి ఆహా కోసం ఏ కంటెంట్ లో నటించినా అది వీక్షకుల సంఖ్యను సబ్ స్క్రైబర్స్ ను మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇదిలావుండగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి 'ఆహా' మరిన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు - ఒరిజినల్ చిత్రాలను ప్లాన్ చేస్తోంది. రాబోయే రోజుల్లో దాదాపు 15 కొత్త వెబ్ సిరీస్‌ లను తీసుకురాబోతోంది. వాటిలో రెండు వినాయక చవితి సంధర్భంగా స్ట్రీమింగ్ కానున్నాయి.