Begin typing your search above and press return to search.
అవుకు రాజు పహిల్వాన్ కథేమి?
By: Tupaki Desk | 5 Jun 2019 5:13 AM GMTఇరుగు పొరుగు స్టార్లతో కలిసి టాలీవుడ్ హీరోలు మల్టీస్టారర్లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు- తమిళం- కన్నడం - మలయాళం- హిందీ ఐదు భాషల స్టార్లను కలిపి సినిమాలు తీస్తూ యూనివర్శల్ గా మార్కెట్ ని కొల్లగొట్టడమే ధ్యేయంగా మన మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ సైతం సౌత్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాల రూపకల్పనకు ప్రణాళికలు వేస్తోంది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కంటెంట్ తో టెక్నాలజీ బేస్డ్ సినిమాలు తీసి దేశవిదేశాల్లో కాసులు కొల్లగొట్టే మంత్రాంగం నడుస్తోంది.
ఆ క్రమంలోనే ఇరుగు పొరుగు స్టార్లతో మన స్టార్లకు ర్యాపో అంతే ఇదిగా పెరుగుతోంది. ఇది ఓ రకంగా అందరు స్టార్లకు కొత్త మార్కెట్ కి ద్వారాలు తెరించింది. ఒక భాషలో రిలీజైన సినిమాని పొరుగు భాషలో ప్రముఖ స్టార్లతో ప్రమోషన్ చేసుకుని డబ్బింగుల రూపంలో క్యాష్ చేసుకునే మార్గం దొరికింది. ఈ విషయంలో ఇటు తెలుగు నిర్మాతలే కాదు ఇరుగు పొరుగు భాషల్లో మేకర్స్ సైతం ఎంతో తెలివిగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఈగ .. బాహుబలి చిత్రాలతో సుదీప్ ఇటు తెలుగు ప్రేక్షకులకు .. అటు దేశవ్యాప్తంగా ఆడియెన్ కి పరిచయం అయ్యాడు. అది అతడి ఇతర సినిమాల మార్కెట్ ని పెంచడం ఆసక్తికరం. ఈగ విలన్ పేరుతో టాలీవుడ్ లో అతడు నటించిన కన్నడ డబ్బింగులకు క్రేజు పెరిగింది.
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా- నరసింహారెడ్డి`లో అతడు ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డిగా నటిస్తుండగా.. ఈ చిత్రంలో సుదీప్ అవుకు రాజు అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ క్రమంలోనే సుదీప్ నటించిన ఓ డబ్బింగ్ సినిమాకి మెగాస్టార్ ప్రమోషన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుదీప్ సినిమా టైటిల్ పహిల్వాన్. తాజాగా ఫస్ట్ లుక్ రివీలైంది. ఈ లుక్ లో కండలు మెలి తిరిగిన పహిల్వాన్ గా సుదీప్ ఆకట్టుకుంటున్నాడు. పహిల్వాన్ గా అతడి రూపం ఆకట్టుకుందని మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఆ లుక్ ని తన మొబైల్ లో చూపించడంతో అభిమానుల్లో జోరుగా వైరల్ అయిపోయింది. మొత్తానికి సైరా కంటే ముందే సుదీప్ నటించిన మూవీ ఇలా వైరల్ అయిపోతోంది. త్వరలోనే పహిల్వాన్ తెలుగు వెర్షన్ సహా ఐదు భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.