Begin typing your search above and press return to search.
మీడియా భండారం అలా బయటపెట్టిన చిరు
By: Tupaki Desk | 7 Dec 2020 2:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ఆయనపై వచ్చినన్ని విమర్శలు ఇంకెవరిపైనా రాలేదేమో! తుమ్మినా దగ్గినా అది వార్త అయ్యేది. ఆయనపై నెగెటివ్ స్టోరీల కోసం ఒక సెక్షన్ మీడియా పనిగట్టుకుని తిరగడంపై ప్రజారాజ్యం నాయకులు తీవ్రంగా గర్హించేవారు. అదంతా గతం అనుకుంటే.. ఇన్నాళ్టికి చిరంజీవి 12 ఏళ్ల నాటి విషయాల్ని గుర్తు చేసుకుని మరీ సెటైర్లు వేసారు. కొన్ని మీడియాల్ని ఉద్ధేశించి మాట్లాడుతూ పంచ్ లతో ఉక్కిరి బిక్కిరి చేయడం తాజాగా చర్చకు వచ్చింది.
ఇంతకీ చిరు మర్చిపోలేని ఆ గతానుభవం ఏమిటి? అంటే... `శానిటైజర్` అనుభవం కావడంతో వర్తమానంతో కనెక్టివిటీ ఉన్నదేనని అందరికీ అర్థమైంది. ఓసారి ఆయన అభిమాని తన చేతికి పండ్లు ఇచ్చారు. అయితే అవి తినే ముందు చిరు తన చేతిని శానిటైజ్ చేసుకున్నారట. అదంతా మీడియా కవర్ చేసింది. అయితే ఆ తర్వాత ప్రజలకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియోని.. చేతిని శానిటైజ్ చేసుకుని పండ్లు తింటున్న వీడియోని కలిపి నెగెటివ్ వార్తా కథనం వండి వార్చారట.
``మొత్తం వీడియో కట్ చేసి ప్రజలకు షేక్ హ్యండ్ ఇవ్వడం.. నేను శానిటైజ్ చేసుకొవడం రెండే రెండు సీన్ లను వరుస పెట్టి చూపించారు. దానికి తోడుగా అభిమానులు అస్పృశ్యులా.. వీళ్లా ప్రజా సేవ చేసేది! అంటూ కథనాలు వినిపించారు`` అంటూ చిరు చెప్పారు.
ఆ వీడియోలు మీ వద్దనే ఉన్నయి.. కావాలంటే చూడండి.. ప్రజలే బుద్ధి చెబుతారు! అంటూ ఇటీవల మీడియ ఇంటర్వ్యూలో కాస్త సీరియస్ టోన్ తోనే అన్నారు. అప్పుడు శానిటైజర్ ఉపయోగిస్తే తప్పు అన్నారు. ఇప్పుడు ఉపయోగించకపోతే తప్పు అంటున్నారు! అంటూ పంచ్ లు వేశారు. అసలు శానిటైజర్ చూస్తుంటేనే భయం వేస్తోంది! అంటూ మొదలు పెట్టి నాటి అనుభవాన్ని చిరు గుర్తు చేసుకున్నారు.
``నా జేబులో శానిటైజర్ ఉంది. కానీ దాన్ని వాడాలంటేనే కాస్త భయంగా ఉంది. మైక్ పై డ్రాప్స్ ఉంటాయి. అందుకని శానిటైజ్ చేయాలనుకున్నా. కాని మీడియాను చూసి ఆగిపోయాను`` అంటూ మీడియాపై పంచ్ లు వేశారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి శానిటైజ్ చేస్కుంటే తప్పన్నారు! అన్న ఆవేదన కూడా ఆయన వెలిబుచ్చారు.