Begin typing your search above and press return to search.

RRR పై చిరు రెస్పాన్స్.. థాంక్స్ చెబుతూ తారక్ ట్వీట్..!

By:  Tupaki Desk   |   25 March 2022 11:33 AM GMT
RRR పై చిరు రెస్పాన్స్.. థాంక్స్ చెబుతూ తారక్ ట్వీట్..!
X
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. నాలుగేళ్ళ నిరీక్షణకు తెరదింపుతూ ఈరోజు (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సినీ అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు - ఇతర సెలబ్రెటీలు తన ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్లకు క్యూలు కడుతున్నారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ మరియు రాజమౌళీలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గురువారం రాత్రే 'ఆర్.ఆర్.ఆర్' బెనిఫిట్ షో చూశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా ట్రిపుల్ ఆర్ సినిమాను హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో చూసారు. తల్లి అంజనా దేవి - కూతుర్లు సుష్మిత శ్రీజ మరియు మనువరాళ్లతో కలిసి చిరంజీవి ఈ సినిమాను చూశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. RRR గురించి చెప్పడానికి మాటలు లేవని.. సింప్లి సూపర్బ్ అని అన్నారు. ముఖ్యంగా సినిమాలో చరణ్ - తారక్ ల మధ్య బాండింగ్ ఫెంటాస్టిక్ గా ఉందంటూ ప్రశంసించారు. ఇద్దరు డ్యాన్స్ లో ఒకరితో నొకరు పోటీపడి చేశారని.. వీరి డాన్స్ ఎపిక్.. ఇంకా చెప్పాలంటే క్లాసిక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. స్టార్ హీరోలు కలిసి నటించాలని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో ట్విట్టర్ వేదికగా మరొకసారి చిరు తన స్పందన తెలియజేసారు. "#RRR అనేది ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ యొక్క మాస్టర్ పీస్!! రాజమౌళి యొక్క అసమానమైన సినిమా విజన్ కి ఒక గ్లోయింగ్ & మైండ్ బ్లోయింగ్ సాక్ష్యం!. ఆర్.ఆర్.ఆర్ టీమ్ మొత్తానికి హ్యాట్సాఫ్!!'' అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి అన్ని వర్గాల నుంచి హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో హీరో ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ''మీ అచంచలమైన ప్రేమకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు మరియు మద్దతు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. RRR సినిమాను చూసి ఆస్వాదించండి'' అని తారక్ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ నటించారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ - శ్రియ శరణ్ - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు