Begin typing your search above and press return to search.
7వ క్లాస్ లో లవ్ లో పడిన చిరు గుట్టు లీక్!
By: Tupaki Desk | 1 Aug 2022 4:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరో అవ్వక ముందు పర్సనల్ లైఫ్ ఎలా సాగేదో తెలుసుకోవాలనే కుతూహాలం కోట్లాది మంది అభిమానులకు ఉంది. అయితే చిరు జీవితంపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కడా లీక్ చేయని ఒక కొత్త పాయింట్ ని ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ లీక్ చేయించాడు. అదేమిటీ అంటే మెగాస్టార్ చిరంజీవి తొలి ప్రేమ గురించి ఇన్నాళ్టికి ఓపెనయ్యేలా చేశారు ఖాన్.
త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న లాల్ సింగ్ చడ్డా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో చిరు-అమీర్-నాగ్ -నాగచైతన్య ఒకే వేదికపై కనిపించారు. ఇక్కడ బిగ్ స్టార్స్ ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఫన్ రైడ్ తరహాలో కార్యక్రమాన్ని రంజింపజేసారు. అదే క్రమంలో మీరు మొదటి సారి ప్రేమలో ఎప్పుడు పడ్డారు? అంటూ అమీర్ ఖాన్ మన మెగాస్టార్ ని సూటిగా ప్రశ్నించారు. ఏడవ తరగతిలో తొలిసారి ప్రేమలో పడ్డానని చిరు ఆ రహస్యాన్ని బయటపెట్టేశారు ఈ వేదికపై. అమ్మాయి సైకిల్ తొక్కుతూ వస్తుంటే తననే చూసేవాడినని కానీ తను ముందుకు చూసి రోడ్ పై వెళ్లాలని సూచించేది! అంటూ చిరు ఎంతో ఫన్నీగా తన ప్రేమకథ గురించి చెప్పారు.
మొత్తానికి తెలుగు సినీజర్నలిస్టులకు సైతం ఇలాంటి రహస్యాన్ని చెప్పని మెగాస్టార్ ఇప్పుడు తన స్నేహితుడు అమీర్ ఖాన్ కి చెప్పేయడం ఆసక్తికరం.
మెగాస్టార్ చిరంజీవి జీవితంపై పుస్తకం..
మెగాస్టార్ చిరంజీవి జీవితంపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు.. సంకలనాలు వచ్చాయి. మద్రాసు పరిశ్రమ నుంచి చిరుతో అనుబంధం ఉన్న సీనియర్ సినీపాత్రికేయుడు.. దివంగత పసుపులేటి రామారావు ఇప్పటికే ఆయనపై పుస్తకాలు రాశారు. చిరంజీవితం- సినీప్రస్థానం.. చిరంజీవితం 150 పేరుతో పుస్తకాలు ఇప్పటికే రిలీజయ్యాయి. అవి మెగాభిమానుల్లో స్ఫూర్తి నింపాయి. సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు చిరుపై బయోగ్రఫీ రూపకల్పనకు సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పుస్తకం రెడీ అవుతోంది.
ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగిన చిరుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన లైఫ్ జర్నీ.. కెరీర్ జర్నీ.. సోషల్ వర్క్ ప్రతిదీ అభిమానులకు స్ఫూర్తి. చిరంజీవి జీవితంలో తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పుస్తకాల రూపంలోనే బయటపడాల్సి ఉంది. అమీర్ ఖాన్ లాంటి స్నేహితులతో ముచ్చట్లలోనూ చిరు చాలా విషయాలు చెబుతారని తాజా ఇన్సిడెంట్ చెబుతోంది.